Viral Vayyari song: ‘వైరల్‌ వయ్యారి’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది..
viral vayyari ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్‌ వయ్యారి’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది..

Viral Vayyari song: “జూనియర్” సినిమాతో కిరీటి రెడ్డి ( Kireeti Reddy) (గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు) తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. ఈ యంగ్ హీరోగా శ్రీలీల  (Sreeleela) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జులై 18, 2025న విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. అయితే, “వైరల్ వయ్యారి” (Viral Vayyari )పాట సినిమాలోని హైలైట్‌గా నిలిచి, సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

Also Read: Anasuya Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు.. హీరోలతో రొమాన్స్ చేస్తా.. అనసూయ కామెంట్స్

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా, దేవి శ్రీ బీజీఎం సినిమాకి ప్లస్ అయింది. అయితే, ఈ మూవీలోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. చాలా మంది ఈ పాటను రీల్ చేసి, ఇంస్టాగ్రామ్ పెడుతూ వైరల్ చేశారు. సినిమా చూడని వారు ఈ పాట వీడియో సాంగ్ కోసం వెయిట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ‘వైరల్ వయ్యారి’ పూర్తి వీడియో సాంగ్ విడుదల అయింది. అంతక ముందు సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన పాట ఇప్పుడు సినీ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

Also Read:  Adah Sharma: అదా శర్మకి కూడా నేషనల్ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది.. కేరళ స్టోరీ దర్శకుడు

ఈ పాట యూట్యూబ్‌లో నేడు పూర్తి వీడియో సాంగ్‌గా విడుదలైంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటకు సంబంధించిన డాన్స్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అభిమానులు, డాన్సర్స్, సామాన్య ప్రేక్షకులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లిరికల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు ఫుల్ వీడియో రావడంతో అభిమానులు మరోసారి చిందులు వేయడానికి రెడీ అవుతున్నారు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే

ఫస్ట్ టైమ్ శ్రీలీలాని కాకుండా హీరో డ్యాన్స్ మాత్రమే చూశా. దుమ్ము దులిపి ఉతికి ఆరేసి పడేసాడు. నాకు చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. ఇద్దరు డాన్స్ ఇరగదీశారు. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు తీసి విజయాలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. రిస్క్ తీసుకుని డాన్స్ చాలా బాగా వేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కిరీటి స్టార్టింగ్ స్టెప్స్ సూపర్. ఒకటి రెండు మంచి స్టోరిస్ ఉన్న మూవీస్ పడితే నీకు తిరిగే లేదు.. టాప్ హీరో అవుతావు బ్రో ఆల్ ది బెస్ట్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం