Coolie vs Rolex
ఎంటర్‌టైన్మెంట్

Coolie: సూర్య ఇచ్చిన ఇంపాక్ట్ నాగార్జున ఇవ్వలేదా? ‘కూలీ’ ట్రైలర్‌పై ఈ కామెంట్స్ ఏంటి?

Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’ (Coolie). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై భారీ క్రేజ్‌ను ఏర్పడేలా చేయగా.. శనివారం (ఆగస్ట్ 2) వచ్చిన ట్రైలర్ మాత్రం అంతగా హైప్‌ని సాధించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు పోటీగా వస్తున్న ‘వార్ 2’ ట్రైలర్‌ని మ్యాచ్ చేయలేదనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Also Read- Hero Krishnasai: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హీరో కృష్ణసాయి ఏం చేశారో చూశారా?

మరి కావాలని ఇలా కట్ చేశారో, లేదంటే ఇందులో ఉన్న మ్యాటరే ఇదో తెలియదు కానీ, అనుకున్నంతగా అంచనాలను అయితే ఈ ట్రైలర్ రీచ్ కాలేదనే చెప్పుకోవాలి. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత ముఖ్యంగా నాగార్జున రోల్‌పై కామెంట్స్ అనుకుంటారో, లేదంటే ట్రోలింగ్ అనుకుంటారో.. ఏది అనుకుంటే అది బాగా జరుగుతుంది. ఒక్క నాగార్జున పాత్ర అనే కాదు, ఏ పాత్ర కూడా అంతగా ట్రైలర్‌లో హైలైట్ కాలేదు. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే, ప్రేక్షకులలో భారీగా అంచనాలుంటాయి. అటువంటి స్టాండర్డ్స్‌ని ఆయన సెట్ చేశారు. కానీ, సూపర్ స్టార్‌‌ రజనీకాంత్‌‌తో సినిమా చేస్తూ, ట్రైలర్ ఇలా ఉన్నా సరికే.. అంతా డిజప్పాయింట్ అవుతున్నారు.

ముఖ్యంగా కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ‘విక్రమ్’ సినిమాలో సూర్య (Suriya) కనిపించిన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా, ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించింది. సూర్య అందులో రోలెక్స్‌‌గా విశ్వరూపం ప్రదర్శించారు. కానీ ఇందులో నాగార్జున ఫుల్ లెంగ్త్ రోల్, కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ ప్రతి నాయక పాత్ర చేస్తున్నా కూడా అంతగా ఇంపాక్ట్ పడలేదంటే.. కావాలనే ఇలా చేశారా? అంటూ ఆయన అభిమానులు కూడా చర్చిస్తుండటం విశేషం. అయితే ట్రైలర్ ఓపెనింగే నాగార్జున డైలాగ్‌ ఉండటంతో ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీలవుతున్నారు.

Also Read- Allu Aravind: ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నా!

అలాగే నాగార్జున లుక్‌పై కూడా కొందరు పెదవి విరుస్తున్నారు. ఇంకాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తే బాగుండేదనేలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘కుబేర’ సినిమాలోని పాత్రే కాస్త అటు, ఇటుగా కనిపిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. రోలెక్స్‌గా సూర్యని చూపించిన తీరుతో పోల్చితే.. నాగార్జున లుక్ అంతగా కనెక్ట్ కావడం లేదనేలా టాక్ నడుస్తుంది. ఇంకా, స్క్రీన్ నిండా స్టార్స్ కనిపిస్తున్నా.. ట్రైలర్ మాత్రం అస్సలు ఎక్కడం లేదంటే, లోకేష్ ఇంతమంది స్టార్స్‌ని డీల్ చేయడంలో తడబడ్డాడా? అనేలా కూడా టాక్ నడుస్తుంది. ఏదిఏమైనా విడుదల లోపు మరో ట్రైలర్ వదిలితే తప్ప.. ఇప్పుడొచ్చిన ట్రైలర్‌తో ఎటువంటి యూజ్ లేదనేలా విమర్శకులు సైతం రియాక్ట్ అవుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!