TS checkposts
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TS News: ఇలాగైతే.. అక్రమ రవాణా ఆగేదెలా?

TS News:

 

సరిహద్దుల్లో చెక్ పోస్టులకు చెక్!
సిబ్బంది తొలగింపునకు ప్రభుత్వం సన్నద్ధం
కెమెరాలతో నిఘా సరిపోతుందా?
ప్రస్తుతం చెక్ పోస్టులు ఉన్నా అక్రమ మార్గాల్లో రవాణా
ధాన్యం, అక్రమ మద్యం, గంజాయి రావాణా
చెక్ పోస్టులు ఎత్తివేస్తే పెరగనున్న అక్రమ రవాణా
అధికారుల్లో సైతం చెక్ పోస్టుల ఎత్తివేతపై భిన్నాభిప్రాయాలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం (TS News) అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. చెక్ పోస్టులు ఎత్తివేస్తే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే ధాన్యం, మద్యం, గంజాయి వంటి వాటిని ఎలా నియంత్రిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. తనిఖీలు చేపట్టకుండా నియంత్రణ ఎలా సాధ్యమనే చర్చకు దారితీసింది. కేవలం సీసీకెమెరాలతో ఎలా పసిగడతారనేది అధికారులకే తెలియడం లేదు. చెక్ పోస్టులు ఎత్తివేస్తే ఇంకా అక్రమరవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని ఉద్యోగులే అభిప్రాయపడుతున్నారు. కొందరు చెక్ పోస్టులు ఎత్తేయాలని, కొందరు వద్దని వారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయం ప్రకారం ముందుకు కెళ్తే.. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఎలాంటి నిఘా పెడతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

రాష్ట్రంలో ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు రవాణా సిబ్బంది నిర్వహిస్తున్న చెక్ పోస్ట్‌లు ఇకపై మానవరహితంగా పనిచేయనున్నాయి. చెక్ పోస్ట్‌ల రద్దు తర్వాత వీటిని రవాణా శాఖ ఏవిధంగా నిర్వహిస్తుంది?, మానిటరింగ్ ఎవరు చేస్తారు?, జవాబుదారితనం ఉంటుందా? ఈ నిర్ణయంతో రవాణా శాఖకు వచ్చే ఆదాయంపై ఏమేరకు ప్రభావం ఉంటుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా శాఖ చెక్ పోస్ట్‌లు అంటేనే అవినీతికి అడ్డాలుగా మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చెక్ పోస్టుల్లో పోస్టింగ్ కోసం ఉద్యోగులు, సిబ్బంది పోటీపడేవారు. పైరవీలు చేసేవారు. అయితే, అవినీతి ఆరోపణలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్ పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెక్ పోస్టులను రద్దుచేసేందుకే మొగ్గుచూపింది. రాష్ట్ర సరిహదుల్లో మొత్తం 15 రవాణా శాఖ చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులు సిబ్బందితో కాకుండా ఇకపై ‘వాహన్ పోర్టల్’ ద్వారా, అడ్వాన్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయనున్నారు.

ఈ మేరకు చెక్ పోస్టుల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు నుంచి ప్రతినిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆయా వాహనాలు ఏమేం ఉల్లంఘనలకు కారణమవుతున్నాయనే విషయాన్ని సీసీ కెమెరాలే గుర్తించనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సీసీకెమెరాల నుంచి తప్పించునే అవకాశం ఏ వాహనదారుడికి కూడా ఉండదని రవాణాశాఖ అధికారులుఅభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాలు గుర్తించిన వెంటనే రవాణాశాఖలోని ఇంటిగ్రేట్ సర్వర్‌కు పంపగానే హైదరాబాద్‌లోని ఎస్టీఏ కార్యాలయంలో పనిచేసే రవాణాశాఖ అధికారులు తక్షణమే పర్యవేక్షించనున్నారు. చెక్ పోస్టు పరిధిలో ఉండే ప్రాంతీయ రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుంది. వారు తమ కార్యాలయం నుంచే వాహనదారులు ఉల్లంఘించిన వాటికి పెనాల్టీని విధించనున్నారు. వాటిని ఆయా రాష్ట్రాల రవాణా శాఖ జరిమానాలు వసూలు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆదాయానికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఆయా అధికారులకు సమాచారం ఇస్తారు. తిరిగి ఆ ఆదాయాన్ని రాష్ట్రానికి చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటారని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా చెక్ పోస్టుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఏమాత్రం ఉండదని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో పనిచేసే సిబ్బంది ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలకు అటాచ్ చేయనున్నారు. సిబ్బంది చేసే పనిని చేసేందుకు చెక్ పోస్టుల్లో ఆటో నంబర్ ప్లేట్స్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇవి చెక్ పోస్టుల మీదుగా ఎన్ని వాహనాలు వెళుతున్నాయి, అలా వెళ్లే వాహనాలు ఏయే పత్రాలు లేకుండా వెళుతున్నాయి అనే వాటిని ఈ కెమెరాలు కనిపెడతాయి. చెక్ పోస్టు మీదుగా వెళ్లే వాహనం ఫిట్ నెస్ సర్టిఫికెట్ కలిగి ఉందా? అది 15 ఏళ్లు పైబడిన వాహనమా? క్వార్టర్లీ ట్యాక్స్ చెల్లించారా? పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా? ఆ వాహనంపై ఏమైనా చలాన్లు ఉన్నాయా? తదితర అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏఎన్పీఆర్ కెమెరాల ఏర్పాటు వల్ల చెక్ పోస్టుల వద్ద అసలు అవినీతి అనేదే లేకుండా పోతుందని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అయా ప్రాంతాల్లో ఉండే అధికారులు జవాబుదారీతనంగా ఉండేవిధంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సైతం పీవోసీ ద్వారా ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు.

Read Also- TS News: రాష్ట్ర పోలీసులకు డీజీపీ జితేందర్ రెడ్డి కీలక సూచన

ఇదెలా ఉంటే వాహనంలో ఏ వస్తువును తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్లేవాటికి అనుమతి ఉందా? లేదా? అనేది చెక్ పోస్టుల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలతో ఎలా గుర్తిస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏదైనా వాహనం ఇతర రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు.. ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వెళ్లేటప్పుడు టార్పాలిన్లు, పూర్తిగా డోర్ క్లోజ్డ్‌గా ఉండే వాహనాలు ఉన్నాయి. అయితే వాటిని ఎలా చెక్ చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సిబ్బందితో వాహనాలను పరిశీలించడంతో వాహనంలో తీసుకెళ్లున్నవాటిని సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను అణువణువు పరిశీలిస్తున్నారు. అంతేగాకుండా అనుమతిలేకుండా తీసుకెళ్లే వాటిని సీజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది లేకుండా సీసీ కెమెరాలతో ఎలా పరిశీలిస్తారనేది చూడాలి. కేవలం చెక్ పోస్టుల్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వాటిల్లో సిబ్బందిని తొలగించడం బాగానే ఉన్నా.. అవినీతిని అరికట్టకుండా చెక్ పోస్టుల్లో సిబ్బందిని తొలగిస్తే ఏం లాభమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వానికి చెక్ పోస్టుల నుంచి భారీగా ఆదాయం వస్తుంది. అక్రమరవాణాను అరికడుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు అక్కడి రవాణాశాఖ అధికారులు పెనాల్టీని వసూలు చేస్తారు. ఇప్పటివరకు నేరుగా వసూలు చేసే అవకాశాన్ని ఇతర రాష్ర్టాలకు అప్పగిస్తున్నారు. వారి నుంచి రవాణాశాఖకు తిరిగి ఆదాయం వెనువెంటనే వస్తుందా? జాప్యం జరిగే అవకాశాలు లేకపోలేదు.

Read Also- Bhatti Vikramarka: కొల్లాపూర్‌లో నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాను

మరోవైపు చెక్ పోస్టుల్లో రవాణాశాఖ సిబ్బంది నిత్యం మానిటరింగ్ చేస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని వానాకాలం, యాసంగిలో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అక్రమంగా ధాన్యం తెలంగాణకు తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. అంతేగాకుండా మద్యం, గంజాయి, ఇతరాత్రాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తుండటం, అధికారుల తనికీల్లో పట్టుపడుతున్న ఘటనలు ఉన్నాయి. సిబ్బంది ఉంటేనే ఇలా ఉంటే లేకపోతే అక్రమ రవాణాను ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందనేది ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. అంతేగాకుండా రావాణా శాఖ అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెక్ పోస్టుల్లో సిబ్బందిని తొలగించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మాత్రం అక్రమరవాణా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంను చెక్ పోస్టులపై తీసుకుంటుందనేది హాట్ టాపిక్ అయింది. అంతేగాకుండా చెక్ పోస్టుల్లో అవినీతి ని అరికట్టకుండా ఎత్తేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సైతం భారీగా గండిపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయమే కీలకం.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?