Jitender Reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TS News: రాష్ట్ర పోలీసులకు డీజీపీ జితేందర్ రెడ్డి కీలక సూచన

TS News:

వృత్తిలో ఉత్తమ నైపుణ్యం సాధించినప్పుడే ప్రజల న్యాయం అందించగలమని వ్యాఖ్య

వరంగల్, స్వేచ్ఛ: పోలీసు అధికారులు వృత్తిలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం అందించగలుగుతారని రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పీటీసీ మామునూర్ వేదికగా గత మూడు రోజులపాటు జరిగిన ‘తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్’ శనివారం (TS News) ముగిసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొనగా, జైళ్ల డీజీపీ డా.సౌమ్య మిశ్రా విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా, పీటీసీకి చేరుకున్న అతిథులకు పోలీస్ కమిషనర్ పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విభాగాల వారిగా ఛాంపియన్‌షిప్ సాధించిన పోలీస్ విభాగాలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ‘ఓవరాల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ’ దక్కించుకుంది. డీజిపీ చేతుల మీదుగా ఈ ట్రోఫీ అందుకున్నారు.

Read also- Viral News: మాటలకు అందని విషాదాన్ని మిగిల్చిన వివాహేతర సంబంధం!

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ పోటీలలో విజయం సాధించిన పోలీస్ సిబ్బందికి, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో మరిన్ని పతకాల సాధించాలని ఆకాంక్షించారు. ఈ డ్యూటీ మీట్ ద్వారా పోలీసులు తమ వృత్తిలో మరిన్ని మెలకువలు, మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా మరింత మెరుగైన పోలీసింగ్‌ను అందించగలుగుతామని చెప్పారు. అలాగే, దర్యాప్తు నిర్వహించడంలో ఈ డ్యూటీ మీట్స్ పోలీస్ అధికారులకు మరింత దోహదపడతాయని తెలిపారు.

Read Also- Pragya Thakur: మాలేగావ్ పేలుళ్ల కేసుపై ప్రగ్యా థాకూర్ సంచలన వ్యాఖ్యలు

జైళ్లో విభాగంలో కూడా..
జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, రెండవసారి వరంగల్లో రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. తాను ఎస్పీగా ఉన్న సమయంలో నిర్వహించిన డ్యూటీ మీట్ గుర్తుకొస్తోందని, త్వరలోనే జైళ్ల విభాగంలో కూడా రాష్ట్రస్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందింస్తామని వెల్లడించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా షో అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్లు డా.సత్య శారద, స్నేహ శిబరీష్, భూపాల్‌పల్లి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీలు కిరణ్ కర్గే, సుధీర్ కేకన్, పీటీసీ ప్రిన్సిపాల్ పూజ,ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ చాహత్ బజాజ్‌తో పాటు ఇతర విభాగాల ఎస్పీలు, కమాండెంట్లు, డీసీపీలు, ఏఎస్పీలు, అదనపు డీసీపీ‌లు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also- Viral News: భారతీయులు విదేశాలకు వెళ్తే వెనక్కి రానిది అందుకేనా!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..