Commodities Prices (imagecredit:swetcha)
తిరుపతి

Commodities Prices: కొండెక్కిన పప్పులు కూరగాయల ధరలు.. తినేదెలా తెచ్చేదెలా!

Commodities Prices: కొండెక్కిన పప్పులు, భగ్గుమంటున్న కూరగాయలు, మరుగుతున్న నూనెలు ఇలా మార్కెట్లో నిత్యవసరాల ధరల దరువుకు సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో లబోదిబోమంటున్నారు. ఏ సరుకు ధర చూసిన భగ్గునమండుతోంది. రెక్కాడితే గాని డొక్కనిండని సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో జనం విలవిలలాడుతున్నారు. అసలే డెంగ్యూ, మలేరియా జ్వరాల సీజనల్ కాలంలో ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజలపై ఈ ధరల పెరుగుదల పెను భారాన్ని మోపుతుంది.

ధరలు మరింత పెరిగే అవకాశం
రోజూ మనం ఇంటింటా నిత్యం వినియోగించే పప్పు, బియ్యం, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్ల ధరలు సైతం ఆకాశాన్ని అంటే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే నిత్యవసరాల ధరలు రెట్టింపు కావడంతో కొందామంటే కొరివి తిందామంటే అడవిని తలపిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. సన్ ఫ్లవర్ నూనె లీటర్ 115 నుంచి 130 వరకు పెరిగింది. మిగిలిన వంట నూనెలు సెంచరీని దాటేస్తున్నాయి. కూరగాయల(Vegetable) ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. కొత్తిమీర, పుదీనా 50 నుండి 60 పలుకుతుంది. పచ్చిమిర్చి 100, చిక్కుడు 80, బీరకాయ 80, బెండకాయ 60, క్యారెట్ 80, కాకరకాయ 80, టమాట 40 నుంచి 50 పలుకుతుండటంతో పేదలు సామాన్య ప్రజల బ్రతుకు జీవనం కష్టంగా మారింది.

Also Read: MLAs Disqualification Case: బీఆర్ఎస్ అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి

గతసంవత్సరం కంటే అదనంగా
గత ఏడాదిలో ఇదే సమయంలో కందిపప్పు ధర 90 నుంచి 95 ఉండేది. ప్రస్తుతం 140 రూపాయలకి ఎగబాకింది. మినప్పప్పు 180 కు చేరింది. మార్కెట్లో బియ్యం ధరలకు కూడా రెక్కలోచ్చాయి. రెండు నెలల క్రితం కింటా 4000 ఉండేది. ఇప్పుడు 6000 కు చేరింది. ఈ విధంగా మార్కెట్లో నిత్యవసర ధరలు అందుబాటులో లేకుండా పోవడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయానియంగా మారింది. మరోవైపు రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో వాహదారులు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నడూ లేనంతగా
ఈ యేడాది నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేనంతగా ఎక్కువగా ఉన్నాయి. శ్రావణమాసంలో వరలక్ష్మి పూజకు పిండి వంటలు చేసుకోలేకపోయామని, నూనె(Oil), పప్పులు, ఉల్లి ధరలు ఈ సారి బాగా పెరిగాయి. పెరిగిన ధరలతో సతమతమవుతున్నామని, రానున్న పండుగల నేపథ్యంలోనైనా నిత్యావసర సరుకుల వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి గృహిణి కవిత అన్నారు.

ధరలు పెరిగాయి
నిత్యావసర వస్తువుల ధరలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. కొనుగోలు చేసే సమయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నెలకు కావాల్సిన మొత్తం కిరాణా సామాగ్రి రూ. 3 వేలకు వచ్చేదని అలాంటిది ఇప్పుడు అదనంగా మరో రూ.1500 భారం పడతుందని అన్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు సరుకులను కిలోల కొద్ది కొనుగోలు చేయడం లేదని అన్నారు. సగం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కిరాణం వ్యాపారి నరేష్ కుమార్ తెలిపారు.

Also Read: Bc reservation bill: కాంగ్రెస్ ప్లాన్‌తో ఇరకాటం.. బిల్లు ఆర్డినెన్స్ పెండింగ్

Just In

01

KV Schools: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4 కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు

Local Body Elections: బీసీ రిజర్వేషన్ల టెన్షన్.. డైలమాలో ఆశావాహులు.. గ్రామాల్లో తగ్గిన దావత్‌ల జోష్!

Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Pawan Kalyan: వారిపై మండిపడ్డ పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Singareni Mines: రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిందే.. సీఎండీ బలరాం ఆదేశం