Kiara Advani: బాలీవుడ్ స్టార్ నటి కియారా అద్వానీ తన 33వ పుట్టినరోజును జులై 31న గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో కొత్తగా చేరిన చిన్నారి, భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, తల్లిదండ్రుల సమక్షంలో ఈ రోజును చాలా ఆనందంగా గడిపానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా అందమైన బర్త్‌డే కేక్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ కేక్‌పై తల్లి తన చిన్నారిని ఒడిసిపట్టుకున్న బొమ్మ చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిని పోస్ట్ చేసిన సందర్భంగా ఇలా రాసుకొచ్చారు.‘నా అత్యంత ప్రత్యేకమైన పుట్టినరోజు! నా జీవితంలోని ప్రేమలతో చుట్టుముట్టబడ్డాను – నా బేబీ, నా భర్త, నా తల్లిదండ్రులు – మా పాటలు నేపథ్యంలో మారుమోగుతూ, ఈ అద్భుతమైన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమ నాపై ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చారు.
Read also- Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
కియారా భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఈ సందర్భంగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె ఒక అందమైన పింక్ డ్రెస్‌లో, స్టైలిష్ షూస్, షేడ్స్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, సిద్ధార్థ్ ఇలా రాసాడు. ‘ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైనది నువ్వే. హ్యాపీ బర్త్‌డే లవ్’ అని రెడ్ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు 2023 ఫిబ్రవరిలో ఒక లావిష్ వెడ్డింగ్ సెరిమోనీలో వివాహం చేసుకున్నారు. 2025 మార్చిలో వీరు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. జులై 15, 2025న వీరు తమ చిన్నారి బేబీ గర్ల్‌ను స్వాగతించారు. ఈ సంతోషకరమైన వార్తను సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ‘మా హృదయాలు నిండిపోయాయి, మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. మాకు ఒక బేబీ గర్ల్ జన్మించింది. కియారా, సిద్ధార్థ్’ అని రాసాడు. వృత్తి పరంగా కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా తదుపరి చిత్రం పరమ్ సుందరిలో జాన్వీ కపూర్‌తో కలిసి నటిస్తున్నాడు. మరోవైపు, కియారా అద్వానీ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి వార్ 2 అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

Read also- Lungs Harmful Habits: ఈ 6 అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీ ఊరిపితిత్తులు ఢమాలే!
బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ రాబోయే చిత్రాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘వార్ 2’ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఇది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానుంది. కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. ముంబైలో జన్మించిన బాలీవుడ్ నటి. 2014లో ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ‘కబీర్ సింగ్’ (2019), ‘షేర్‌షా’ (2021), ‘భూల్ భులయ్యా 2’ (2022) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘భరత్ అనే నేను’ (2018) ‘వినయ విధేయ రామ’(2019) చిత్రాల్లో నటించింది. ‘వార్ 2’లో ఆమె హృతిక్ రోషన్తో రొమాంటిక్ పాత్రలో కనిపిస్తోంది. ఆమె నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ, ప్రీతమ్ సంగీతంలో, అరిజిత్ సింగ్ గాత్రంతో విడుదలైన ‘ఊపిరి ఊయలగా’ పాటలో ఆమె కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.