GHMC Commissioner: స్పెషల్ డ్రైవ్ విజయవంతం చేయాలి..
GHMC Commissioner ( Image Source: Twitter)
Telangana News

GHMC Commissioner: స్పెషల్ డ్రైవ్ విజయవంతం చేయాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

GHMC Commissioner: వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు చేపట్టిన శానిటేషన్ మాన్‌సూన్ స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పిలుపునిచ్చారు. గత నెల 29న ప్రారంభమైన ఈ డ్రైవ్‌ను ఆయన గురువారం శేరిలింగంపల్లి జోన్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావుతో కలిసి కావూరీహిల్స్‌లో తనిఖీలు చేసిన కమిషనర్, కార్మికులతో మాట్లాడి, కాలనీలలో పరిశుభ్రత చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు.

Also Read: Uttarakhand Tragedy: దేశంలో ఘోరం.. బాలుడ్ని పొట్టనపెట్టుకున్న 5 ఆస్పత్రులు.. రంగంలోకి సీఎం!

అనంతరం పటాన్‌చెరువును సందర్శించిన కమిషనర్, డ్రైవ్‌లో చేపట్టిన పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్‌లు, యాంటీ-లార్వా స్ప్రేయింగ్ ఆపరేషన్‌లు, సీజనల్ డిసీజ్ నివారణ అంశాలను సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుధ్య పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ‘డ్రై డే’ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేయాలని సూచించారు.

Also Read: Eye Care: వెచ్చని కంటి కాపడం, కాజల్ వాడకం మీ కళ్ళకి సురక్షితమేనా? కంటి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఆయన ఇంకా మాట్లాడుతూ, పౌర చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజల సహకారంతో దోమల నివారణ కార్యక్రమాన్ని మరింత ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల భద్రత పెంపొందించడంలో భాగంగా రోడ్ సేఫ్టీ డ్రైవ్‌ను కూడా జీహెచ్ఎంసీ నిర్వహిస్తుంది. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో పాట్ హోల్స్, క్యాచ్ పిట్స్, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. గురువారం ఒక్క రోజే 416 గుంతలను పూడ్చి, రహదారి భద్రతకు మరింత వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగాపూర్ నుంచి పాదయాత్ర షురూ!

Just In

01

IPL Auction Live Blog: వెంకటేష్ అయ్యర్‌కు రూ.7 కోట్లే.. అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ క్రికెటర్లు.. ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్

Gadwal News: పంచాయతీ పోరులో గొంతు విప్పుతున్న యువగళం.. ఎన్నికల బరిలో నిలిచిన యువత

Upcoming Redmi Phones 2026: 2026లో భారత్‌ మార్కెట్లోకి రానున్న టాప్ 5 రెడ్‌మీ ఫోన్లు..

TTD Board Meeting: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. ప్రతీ భక్తుడు తెలుసుకోవాల్సిందే!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలో విచిత్రం.. చనిపోయిన వ్యక్తిని.. మెజారిటీతో గెలిపించిన గ్రామస్థులు