swetcha special on praneeth rao phone tapping case
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. ఆధారాలన్నీ ఇవ్వనున్న ‘స్వేచ్ఛ’

swetcha special on praneeth rao phone tapping case


Phone Tapping Issue : జూబ్లీహిల్స్ అడ్డాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడించిందని ముందునుంచీ ‘స్వేచ్ఛ’ చెబుతూ వస్తోంది. ఇప్పుడదే నిజమైంది. ఈ కేసును పంజాగుట్ట పీఎస్ నుంచి జూబ్లీహిల్స్ ఏసీపీకి బదిలీ చేస్తూ ఉమ్మడిగా సిట్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తదుపరి విచారణ కొనసాగనుంది.

పోలీసుల అదుపులో ఉన్న ప్రణీత్ రావు నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ అడ్డాగానే ట్యాపింగ్ కథంతా నడిపించారని తెలిసింది. జూబ్లీహిల్స్ లోని కీలక నేతకు సంబంధించిన భవనంలో స్కెచ్ గీసినట్టు సమాచారం. ఓ ఛానల్ ను అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది ఈ ముఠా. అందుకే జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఏసీపీకి బదిలీ చేస్తూ సిట్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.


ప్రతిపక్ష నేతల ఫోన్లతోపాటు సొంతింటి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమందిని దొంగల లిస్టులో చేర్చి వారి లొకేషన్ ను కూడా ట్రాక్ చేసినట్టు భావిస్తున్నారు. ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఈ కేసుపై కీలక సమాచారం సేకరించింది. ట్యాపింగ్ కు గురైన ఫోన్ నెంబర్లను దొరకబట్టింది. ఈ లిస్ట్ తో పాటు అన్ని ఎవిడెన్స్ లు ‘స్వేచ్ఛ’ చేతిలో ఉన్నాయి. త్వరలోనే ఈ ఆధారాలను సిట్ కు అందించనుంది ‘స్వేచ్ఛ’.

కేసీఆర్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా పనిచేశాడు దుగ్యాల ప్రణీత్‌ రావు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశాడు. దీనిపై ఈమధ్యే చర్యలు తీసుకోవడంతో సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేష్‌ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ కార్యాలయంలోని రెండు రూముల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా ఉపయోగించుకొని రహస్య సమాచారాన్ని సేకరించినట్టు గుర్తించారు. కొన్ని కంప్యూటర్లలో కీలక రికార్డులను కూడా మాయం చేసినట్టు తెలిసింది. ఇదంతా గతేడాది డిసెంబర్‌ నాలుగో తేదీన ధ్వంసమైనట్టు గుర్తించారు. దీంతో అతడిపై ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ, ఐటీ యాక్ట్‌ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, జూబ్లీహిల్స్ అడ్డాగానే ఇదంతా నడిపినట్టు పోలీసులకు తెలియడంతో కేసును అక్కడికే ట్రాన్స్ ఫర్ చేసి సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ