Damodar rajanarsimha
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Damodar Rajanarsimha: మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. పక్కా ప్లాన్

Damodar Rajanarsimha: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ శుక్రవారం అందోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెండు రోజులుగా జోగిపేటలోనే ఉంటూ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు.

కలికట్టుగా విజయవంతం చేసేలా..

నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఏఐసీసీ నాయకుడు రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తర్వాత అదే స్థాయిలో అందోలులో మరోసారి పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీనాక్షి పర్యటన రెండు రోజుల పాటు జరుగనున్నందున కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని నాయకులకు కార్యకర్తలకు మంత్రి సూచించారు. రాహుల్‌ జోడోయాత్ర తరహాలోనే ఈ పాదయాత్రను కూడా విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

Also Read: Ind vs Pak WCL 2025: పాక్‌తో సెమీస్ బాయ్‌కాట్.. ఫైనల్‌కు వచ్చినా ఇదే చేసేవాళ్లం.. భారత జట్టు!

సంగుపేట నుంచి జోగిపేట వరకు.. 

మీనాక్షి నటరాజన్‌ చేపడుతున్న పాదయాత్రకు జనహిత యాత్రగా నామకరణం చేశారు. అందోలు మండలం సంగుపేట నుంచి జోగిపేటలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగనున్నది. సంగుపేట వద్ద మీనాక్షి నటరాజన్‌కు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆమె చేరుకుంటారు. కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేసి పాదయాత్రను ప్రారంభిస్తారు. జోగిపేట కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు చేపట్టనున్నారు. అందుకు జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. దారిపొడగునా ఎల్‌ఈడీ లైటింగులను ఏర్పాటు చేస్తున్నారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, కమాన్‌లు, బెలూన్‌లు, పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.

విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

మీనాక్షి నటరాజన్‌ శుక్రవారం చేపడుతున్న జనహిత పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి అన్నారు. ఈ యాత్రలో నియోజకవర్గంలోని పార్టీకి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా హజరై పెద్ద సంఖ్యలో పాల్గొనాలని  సూచించారు. ఆగస్టు 2వ తేదీన శ్రమదానంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు లక్ష్మిదేవీ గార్డెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు.

Also Read: Sheep scheme Scam ED: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు..హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు