Kingdom genuine Review: వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ పడుతున్న విజయ్ దేవర కొండకి ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో ఆయన జెర్సీ లాంటి కల్ట్ బొమ్మ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడంతో మంచి హైప్ అయితే క్రియోట్ అయింది. ఎంత గానో ఎదురు చూస్తున్న కింగ్డమ్ (2025) సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్. ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించగా, అనిరుధ్ రవిచంద్ర సంగీతాన్ని అందించారు. మరి, అంత హైప్ ఇచ్చిన విజయ్ దేవర కొండకి ఆ హిట్ పడిందా? లేదనేది రివ్యూలో తెలుసుకుందాం..
కథ ఏంటంటే?
కింగ్డమ్ ఒక రివెంజ్ డ్రామా, స్పై యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. విజయ్ దేవరకొండ పాత్ర తన అన్నయ్య (సత్యదేవ్) మరణం చుట్టూ జరిగే కథలో ప్రతీకారంతీర్చుకోవాలనుకుంటాడు. అయితే, ట్రైలర్‌లో సత్యదేవ్‌ని క్రిమినల్‌గా చూపించి సస్పెన్స్ క్రియోట్ చేశారు. కానీ, అతను నిజంగా క్రిమినలా ? లేదనేది కథలోని కీలక అంశం.
ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ నటన: విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ , డెడికేషన్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. అతని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి.
అనిరుధ్ సంగీతం: అనిరుధ్ రవిచంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు హైలెట్ గా నిలిచింది.
టెక్నికల్ ఎక్సలెన్స్: సినిమాటోగ్రఫీ (గిరీష్ గంగాధరన్), ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ అద్భుతంగా ఉంది. బోట్ సీక్వెన్స్ వంటి యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
ఫస్ట్ హాఫ్: ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లే, ఇంట్రడక్షన్‌తో ఆకట్టుకుంది. స్టోరీపై ఫోకస్ చేసి, డైవర్షన్స్ లేకుండా సాగింది.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్: సెకండ్ హాఫ్ కొంత లాగ్ కాగా, రొటీన్‌గా సాగింది. క్లైమాక్స్ అంతా రెట్రో స్టైల్‌లో ఉండటం కొంత నిరాశపరిచింది.
స్టోరీలో డెప్త్ లోపం: అన్న దమ్ముల ఎమోషన్ సీన్స్ లో ఇంకాస్తా ఎమోషనల్ సెంటిమెంట్ జోడిస్తే చాలా బావుండేది.
ఓవర్ హైప్: సినిమాపై భారీ అంచనాలు పెట్టుకునేలా చేసి, కంటెంట్ ఆశించిన స్థాయిలో ఉండకపోవడం కొంత మైనస్ అయింది.
ఇతర పాత్రలు: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్రకు పెద్దగా స్కోప్ లేదు, అలాగే వెంకిటేష్ వీ.పీ. నటన సరిగా ఇంపాక్ట్ చూపలేకపోకపోయింది.
సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే: ఓవరాల్ గా గుడ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంబురాలు మొదలు పెట్టొచ్చు.. యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ కి ఫుల్ బిర్యానీ తిన్న ఫీల్ రావడం పక్కా.