Nithya Menon: నిత్యా మేనన్ గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తుంది. అయితే, ఆమె నటించిన తాజా చిత్రం ‘సార్ మేడమ్’ ప్రమోషన్ల లో పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిత్యా మేనన్ ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఈ విధంగా స్పందించారు. “ఎప్పుడూ ఈ పెళ్లి గోల ఏంటి అందరికీ?” అని, పెళ్లి గురించి అడిగే ప్రశ్నలపై తన విసుగుగా ఉందని చెప్పింది. గతంలో కూడా, 2022లో నిత్యా మేనన్ పెళ్లి గురించి వచ్చిన పుకార్లను ఖండించారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో “నేను పెళ్లి చేసుకోవడం లేదు, ఇది కేవలం ఊహాజనిత కథ మాత్రమే” అని స్పష్టం చేశారు. ఆమె తన వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛను విలువైనదిగా భావిస్తూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. అలాగే, వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా పెళ్లి గురించి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది.
పెళ్లి గురించి మీడియా రిపోర్ట్స్ కి, నిత్యా మీనన్ కి మధ్య సంభాషణ ఇలా జరిగింది..
మీడియా రిపోర్టర్ : తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది, మరి పెళ్లి మీద మీ ఓపెనియన్ ఏంటి?
నిత్యా మేనన్ : నా పెళ్లా .. ఎవరితో?
మీడియా రిపోర్టర్: అంటే దీని గురించే వార్తలు ఎక్కువగా నడుస్తున్నాయి అండి
నిత్యా మేనన్: ఎప్పుడు చూసిన నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అడుగుతారు, మరి నేను ఏం చెప్పాలి?
మీడియా రిపోర్టర్: మరి, ఈ సినిమా చేశాక పెళ్లి చేసుకోవాలని అనిపించిందా?
నిత్యా మేనన్: విజయ్ సేతుపతిని, డైరెక్టర్ ను చూపిస్తూ వారిద్దరూ.. నాకు చాలా ట్రై చేశారు?
విజయ్ సేతుపతి : అయ్యో.. వాళ్ళకి కొంచం క్లారిటీగా చెప్పండి.
నిత్యా మేనన్ : అయ్యో .. అలా కాదు? పెళ్లి చేసుకోమని చెప్పారు? నన్ను ఒప్పించాడనికి చాలా ట్రై చేశారు? జీవితంలో ఇది మంచి విషయం అని చాలా సార్లు చెప్పారు. కానీ, నేను ఒప్పుకోను.