Telugu Heroine: తెలుగు సినీ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగింది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రవితేజ, నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ తో బాహుబలి 1, బాహుబలి 2 లాంటి బ్లాక్‌బస్టర్‌లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
కానీ, బాహుబలి తర్వాత ఆమె సినిమాలు తగ్గించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అవకాశాలు లేకపోవడమా, లేక ఆమె సినిమాలకు దూరంగా ఉండాలనుకుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఘాటి సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో గంజాయి వ్యాపారం చుట్టూ తెరకెక్కిన ఈ పాన్-ఇండియా యాక్షన్ క్రైమ్ డ్రామా ఆమె కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్‌గా చెప్పబడుతోంది.
ఘాటిలో అనుష్క రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుంది. ఒకటి అందమైన అమ్మాయిగా, మరొకటి ప్రతీకార తీర్చుకోవడం కోసం ఉన్న గ్రామీణ స్త్రీగా కనిపించనుంది. టీజర్, పోస్టర్‌లలో ఆమె లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కానీ, ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ రెండుసార్లు వాయిదా పడటంతో ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ నుంచి స్పష్టమైన అప్‌డేట్ లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, అనుష్క బెంగళూరుకు మకాం మార్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా ? లేక యోగా టీచర్‌గా తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటుందా? అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.