Nysa Devgn ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్‌.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్

Nysa Devgn: బాలీవుడ్ నటులు కాజోల్, అజయ్ దేవ్‌గణ్ ల కుమార్తె, స్విట్జర్లాండ్‌లోని గ్లియోన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సాధించింది. అయితే, తాజాగా దీనికి సంబంధించిన వేడుక మాంట్రియక్స్‌లో జరిగింది. ఇక్కడ నైసా చీరలో అద్భుతంగా కనిపించింది, ఆమె జుట్టును లూస్ వేవ్స్‌లో స్టైల్ చేసింది. ఇక కాజోల్ నీలం రంగు చీరలో వెండి ఆభరణాలతో మెరిసిపోగా, అజయ్ దేవ్‌గణ్ గ్రే జాకెట్, వైట్ ప్యాంట్‌లో, వారి కుమారుడు యుగ్ బీజ్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించారు.

Also Read: Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్‌.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్

కాజోల్ ఈ గొప్ప క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా షేర్ చేస్తూ, ” ఇది నాకు చాలా ప్రత్యేకమైనది.. చాలా గర్వంగా ఉంది.. పూర్తిగా భావోద్వేగంతో ఉన్నాను..” అనే సందేశంతో షేర్ చేసింది. ఈ వీడియో స్విట్జర్లాండ్‌లోని మాంట్రియక్స్‌లోని ఒక అద్భుతమైన సరస్సు ఫొటోలతో మొదలైంది, ఇక్కడ నైసా గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో చదువుతుంది. తర్వాత నైసా గ్రాడ్యుయేషన్ క్యాప్‌లో ఉన్న ఫోటో, ఆమె పాఠశాలలో జరిగిన వేడుకల గురించి ఈ వీడియోలో ఉన్నాయి.

Also Read: War2: ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఐడియా ఎవరిదో తెలుసా?

కాజోల్ స్నేహితులు,ఫ్యాన్స్ నైసాను అభినందించారు. “ కంగ్రాట్స్ , ఇలాగే గొప్ప విజయాలు సాధించాలి” కామెంట్ లో రాసుకొచ్చారు. “ కంగ్రాట్స్ , నైసా.. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ” అని ఇంకో అభిమాని రాశారు.

Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ

నటిగా మారాలనే ఆశ నైసాకు లేదు..

కాజోల్, అజయ్ 1999లో వివాహం చేసుకున్నారు. వారికీ నైసా, యుగ్‌ ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్‌లో నటిగా మారాలనే ఆశ నైసాకు లేదు. “ ఆమెకు సినిమాలపై ఆసక్తి లేదు. నా కుటుంబంలోని పిల్లలందరినీ నేను ప్రేమిస్తున్నాను. వారు ఎంచుకున్న వాటిలో విజయం సాధిస్తారని తెలుసు, వారు వాటితోనే సంతోషంగా ఉన్నారు. నేను దానిని చూసి చాలా సంతోషంగా ఉన్నాను.” అంటూ కాజోల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ