Yamudu Audio Launch
ఎంటర్‌టైన్మెంట్

Yamudu: చిన్న ప్రయత్నమే కానీ.. పెద్ద సక్సెస్ కొడుతుంది

Yamudu: జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి (Jagadeesh Amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి పాటను ప్రియాంక, మల్లిక విడుదల చేయగా.. రెండో పాటను బెక్కెం వేణుగోపాల్ రిలీజ్ చేశారు. మూడో పాటను కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక విడుదల చేయగా, ‘యముడు’ నాలుగో పాటను మల్లిక రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. చిన్న ప్రయత్నంగా వస్తున్న ఈ సినిమా.. గ్రాండ్ సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.

Also Read- Satyadev: ఓటీటీలోకి సత్యదేవ్ సర్వైవల్ డ్రామా.. డోంట్ మిస్!

‘‘ప్రతీ ఏడాది వందల సినిమాలు వస్తుంటాయి. అందులో కొంత మందికి మాత్రమే విజయం వరిస్తుంది. చిన్న చిత్రాలు ఈ మధ్య వండర్స్ క్రియేట్ చేయడం చూస్తున్నాం. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతుంది ఈ కంటెంట్ చూస్తుంటే. జగదీష్ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని.. ఇప్పుడు హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తనే ఈ ‘యముడు’ అనే సినిమాను తీశారు. మొదటి చిత్రాన్నే ఇంత ప్రయోగాత్మకంగా తీయడం గొప్ప విషయం. భవానీ సంగీతం బాగుంది. ఈ మూవీతో చాలా మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్నారు. శ్రావణి శెట్టికి ఈ సినిమా సరైన బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు బెక్కెం వేణు గోపాల్.

Also Read- War2: ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఐడియా ఎవరిదో తెలుసా?

జగదీష్ ఆమంచి మాట్లాడుతూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను, సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎన్నో ప్రయత్నాల అనంతరం ఈ రోజు ‘యముడు’ సినిమాతో ఇక్కడి వరకు వచ్చాను. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే. ఈ పాయింట్‌లతోనే ‘యముడు’ సినిమాను తీశాం. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. మా టీమ్‌ని ఆశీర్వదించిన వేణు గోపాల్‌కు ధన్యవాదాలని అన్నారు. హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లాడుతూ.. గొప్ప కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మన జీవితంలో జరిగే ఘటనలను, చేసే తప్పులే ఇందులో ఉంటాయి. అందరికీ కనెక్ట్ అయ్యేలా శివ మంచి స్క్రీన్‌ప్లేని రాశారు. జగదీష్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించి ఆయన కష్టానికి తగ్గిన ఫలితాన్ని ఇస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!