Maoist (imagecredit:swetcha)
తెలంగాణ

Maoist: మావోయిస్టుల వారోత్సవాలు.. ఎక్కడికక్కడే తనిఖీలు

Maoist: తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు వారోత్సవాలు నేటి నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టులు ఏర్పాట్లు చేసుకున్నారు. అనాదిగా కొనసాగుతున్న ఈ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ములుగు, కొత్తగూడెం జిల్లాల ఎస్పీల ఆదేశాలతో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వారం రోజులపాటు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాలు ఎన్కౌంటర్లలో అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ రెడీమేడ్ స్తూపాలతో వారికి విప్లవ జోహార్లను తెలుపుతారు. అలా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని మావోయిస్టులకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహిస్తారు.

చతిస్గడ్.. తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్
ప్రస్తుతం తెలంగాణ(Telangana) లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని అనుమానంతో ములుగు(Muluu), కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు శబరీష్, రోహిత్ రాజ్ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలను చేస్తున్నారు. ఉదయం వేళలు మొదలుకుంటే మధ్య రాత్రి వేల వరకు ఈ ఈ తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను సీజ్ చేసి అందులో ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొత్తగూడెం(Kothagudem), ములుగు(Mulugu) జిల్లాలోని మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడకుండా పోలీసులు అడవుల్లోనూ సైతం విస్తృత తనిఖీలను చేపడుతున్నారు. ముఖ్యంగా రెండు జిల్లాల్లోని గుత్తి కోయ గూడాల్లో ఆయా సరిహద్దు రహదారుల వెంట పోలీసులు హై అలర్ట్ అయ్యారు.

Also Read: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో వీరు అనర్హులు.. పోటీకీ దూరం

బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ములుగు, కొత్తగూడెం జిల్లాలకు చెందిన బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా ఐ ఈ డి(IED) బాంబులు వంటివి అమర్చితే వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తిస్థాయి పటిష్ట ప్రణాళిక చర్యలు చేపడుతున్నారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఏజెన్సీ ప్రాంత పోలీసులను అలర్ట్ చేసి తనిఖీలను ముమ్మరంగా చేపిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కనబడితే అదుపులోకి తీసుకొని విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ(Telangana), చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల గుండా వెళ్లే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ(RTC) బస్సుల్లో క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దండకారణ్యంలో కూంబింగ్స్ చేపడుతూ మావోల కోసం గాలింపు చర్యలు సైతం చేపడుతున్నారు. గుత్తి కోయ గూడాల్లో తనిఖీలు చేపడుతూ కొత్తవారు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కొత్తవారికి ఆశ్రయమిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సంబంధిత ఆదివాసీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

వారోత్సవాల్లో విఐపి లు జాగ్రత్తగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో వీఐపీలు(VIP), వి వీఐపీ(VVIP)లు ఇతర ప్రాంతాల్లో భద్రంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు తమ తమ స్థానాల్లో భద్రంగా ఉండాలని వివరిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అసలే తిరగవద్దని సూచనలు చేస్తున్నారు. మావోయిస్టులు చేపడుతున్న వారోత్సవాలను రెండు జిల్లాల పోలీసులు తిప్పుకొట్టేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతున్నారు.

Also Read: Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా.. బండి హాట్ కామెంట్స్

Just In

01

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?