Dasari Narayana Rao: తెలుగు సినిమా పరిశ్రమలో తన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సినీ విమర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్. ‘కొతల రాయుడు’ చిత్రంతో నిర్మాతగా ప్రవేశించిన ఆయన, ‘మొగుడు కావాలి’, ‘స్వర్ణక్క’, ‘పొతే పోని’ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. తన సినీ దృష్టికోణంలో సామాజిక అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటూ, తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై నిరంతరం గొంతెత్తుతుంటారు. యూట్యూబ్ వేదికగా సమకాలీన సినీ రాజకీయాలపై విమర్శాత్మక వ్యాఖ్యలు చేస్తూ చర్చల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ యూ ట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ఎవరు అనే దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read also- TCS layoffs 2025: టీసీఎస్ అనూహ్య ప్రకటన.. ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే? మీరు ఏం చెప్తారు. అని అడిగిన ప్రశ్నకి ‘సర్వీస్ చేయడానికి ఎఫెర్డబులీటీ ఉండాలి. అప్పుడు దాసరి నారాయణ రావు టైంలో ఆయన ఇట్లో ఎప్పుడూ అరవైమందికిపైగా టీలు, టిఫిన్‌లు, భోజనం ఇలా రోజూ పదుల సంఖ్యలో జనాలు వస్తూ ఉండేవారు. ఆయన నెలకు దాదాపు 20 మందికి పైగా డబ్బులు పంపించేవారు. అవే కాకుండా ప్రతి పండక్కీ పబ్బానికి ఆయన వద్ద ఉన్న అందరికీ డబ్బులు పంచేవారు. ఇందులో ఒక్కటీ నేను గానీ ఇక్కడ ఉన్న వారు కానీ చెయ్యలేరు. కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేరు అదికూడా కొనాలి కాబట్టి. ఇవన్నీ భరించే వ్యక్తులు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఆయనలా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఒక మనిషి దాసరి నారాయణరావు అవ్వలేరు. ఆయన చేసినన్ని పనులు ఎవ్వరూ చెయ్యలేరు. సకల కళల్లోన్నూ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఈ భూ ప్రపంచంలో దాసరి లాంటి వారు పుట్టడు అది ఇంపాసిబుల్. అలాంటి వ్యక్తి మళ్లీ వస్తారు అనుకోవడం దురాశ.’ అంటూ భరద్వాజ చెప్పుకొచ్చారు.
Read also- Vishwambhara: ఆ పాట కాంట్రవర్సీపై స్పందించిన విశ్వంభర డైరెక్టర్.. అందుకేనా అలా చేసింది
అయితే తెలుగు సినిమా పరిశ్రమకు ప్రస్తుతం పెద్ద ఎవరూ లేరు. అసలు అలాంటి పదవులు ఉండవు అని అన్నారు. ప్రస్తుతం ఫిలిం జర్నలిజం ఒక వ్యాపారం అంయిపోయింది అని అన్నారు. ‘కన్నప్ప’ సినిమాపై కామెంట్స్ చేయడంపై వివరణ ఇచ్చారు. శివుడు, పార్వతి పాత్రలు నచ్చలేదని, చెప్పడం వంద శాతం కరెక్టే అన్నారు. ‘కన్నప్ప’ లోని ఆ రెండు పాత్రలు ఇప్పటికీ సెట్ కాలేదనే చెప్తా అన్నారు. రాఘవేందర్రావు దర్వకత్వంలో వచ్చిన ‘పాండురంగ మహత్యం’ ఇలాంటి ఎక్సపర్మెంట్లు చెయ్యడం వల్లే ఆగలేదన్నారు. మెగస్టార్ చిరంజీవికి ఇప్పటికీ తమ్ముడు గానే భావిస్తానని, ఆయన తనకు బాగా కావాల్సిన వ్యక్తి అని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.