Double Bed House Scam (imagecredit:swetcha)
తెలంగాణ

Double Bed House Scam: డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కుంభకోణంలో మరో కేసు

Double Bed House Scam: డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కుంభకోణంలో మరో కేసు బయటపడింది. స్థానిక MLA క్యాంప్ ఆఫీస్‌లో అసిస్టెంటుగా పనిచేస్తున్న హరిబాబు డబల్ బెడ్ రూం ఇడ్లు(Double bedroom houses) ఇప్పిస్తానని లక్షల రూపాయలు దండుకొన్న విషయంలో పోలీసులు(Police) అరెస్టు చేసి రిమాండుకు పంపిన సంఘటన మరవకముందే ఇదే డబల్ బెడ్ రూం విషయంలో మరో సంఘటన జరిగింది.

డబుల్ బెడ్ రూమ్ పథకం పేరిట
ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ పథకం(Double Bedroom Housing Scheme) కుంభకోణంపై జీడిమెట్ల పోలీసులు(Jeedimetla Police) మరో ఇద్దరిని రిమాండుకు పంపారు. బిఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్త స్థానిక ఎమ్మెల్యే(MLA)కు సన్నిహితుడు జి. శ్రీధర్(Sridhar) బాధితులను డబుల్ బెడ్ రూమ్ పథకం పేరిట ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు ఇతర ఖర్చులను చెల్లించాలని బాధితులను మోసం చేసాడు. ఇతను తన స్నేహితుడు జియో(Jio) ఉద్యోగి ప్రదీప్ ప్రసాద్(Pradeep Prasad)తో కలసి జి. శ్రీధర్(Sridhar) ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీమ్ నకిలీ కేటాయింపు లేఖలను తయారు చేసి బాధితులకు ఇచ్చాడు.

మోసపోయిన ఓ మహిళ ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు నిందితులైన జి శ్రీధర్ మరియు ప్రదీప్ ప్రసాద్లను సుచిత్ర(Suchitra)లోని గోదవారి హోమ్స్ వద్ద అరెస్టు చేసి, కొన్ని నకిలీ కేటాయింపు లేఖలు, కారు, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్, వెబ్ కెమెరా, ప్రింటర్, స్కానర్ మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండుకు తరలించినట్లు బాలనగర్ ఎసిపి పి నరేష్ రెడ్డి(ACP Naresh Reddy) తెలిపారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్!

Just In

01

Ande Sri: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ కవి అందెశ్రీ కన్నుమూత

Tamil Film Producers Council: కోలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఆదాయ భాగస్వామ్య నమూనాను తప్పనిసరి చేసిన టీఎఫ్‌పీసీ.. ఎందుకంటే?

Ramachandra Rao: రాష్ట్రంలో ఫ్రీ బస్సు వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి: రాంచందర్ రావు

Kishan Reddy: రాష్ట్రాభివృద్ధిపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?.. కిషన్ రెడ్డి సవాల్

TET Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్.!