CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ

CM Revanth Reddy: సీఎం సంతకం తర్వాత.. అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ఎట్టకేలకు కదలిక వచ్చినట్లు తెలుస్తోఉంది. టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి రెండు ఫైల్స్ ఉన్నప్పటికీ సీఎం(CM) ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సీఎం సంతకం తర్వాత ప్రమోషన్ల ఫైల్ విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయానికి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్(School Assistant) ఖాళీల్లో ప్రమోషన్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి(CM) ఆమోదం తెలిపారని విశ్వసనీయ సమాచారం.

ఒకట్రెండు రోజుల్లో విడుదల
ఇప్పటికే ప్రమోషన్లకు సంబంధించి 2025 జూన్ 30 నాటికి ఉన్న అన్ని ఖాళీలను ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. అన్ని కేటగిరీల వారికి ప్రమోషన్లు(Promotions) కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకట్రెండు రోజుల్లోనే విడుదలవుతుందని విశ్వనసీయ సమాచారం. కాగా సంవత్సరకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

Also Read: BC Reservation Bill: బీజేపీ పోరు బాట.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్

వేసవి సెలవులు ముగిసే లోపు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని గతంలో యూటీఎఫ్(UTF)​ తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు వినతులు సమర్పించారు. అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక నిర్ణయానికి రావడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. త్వరగా షెడ్యూల్ ను రిలీజ్ చేయాలని కోరుతున్నాయి.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు