Telangana Tourism ( IMAGE credit: twitter)
తెలంగాణ

Telangana Tourism: టూరిజం పాలసీలో భాగంగా అభివృద్ధికి శ్రీకారం

Telangana Tourism: తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నూతన టూరిజం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలగలిసిన తెలంగాణ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 27 సర్క్యూట్లుగా ఏర్పాటు చేసి ఆ సర్క్యూట్లలో అభివృద్ధి పనులు చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఫేజ్ ల వారీగా పనులు చేపట్టి పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించాలని పర్యాటక శాఖ టార్గెట్​ పెట్టుకున్నది. ఫస్ట్ ఫేజ్ లో 8 నుంచి 10 సర్య్కూట్లపై దృష్టిసారించింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

27 సర్క్యూట్లను ఏర్పాటు

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)  ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే టూరిజం 2025–30పాలసీని రూపొందించింది. ఆ పాలసీతో 15వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 సర్క్యూట్లను ఏర్పాటు చేయగా యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, వేములవాడ, ఆలంపూర్- సోమశీల, రామప్ప, కాళేశ్వరం, మెదక్, వరంగల్, నల్లగొండ, పాలకూర్తి, కరీంనగర్, చార్మినార్, హైదరాబాద్- రంగారెడ్డి- మేడ్చల్, సిద్దిపేట, నల్లమల్ల, శ్రీరాంసాగర్, జెన్నారం, ట్రైబల్ క్లస్టర్, నాగార్జునసాగర్, వికారాబాద్, మహబూబ్ నగర్, పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల్- కొత్తకోట, కోరటికల్-కుంట్ల, పోచేరా, గాయత్రి, కొండాపూర్-దుళికట్ట-, కరుకొండ, -నేలకొండపల్లి-, బుద్దవనం, -ఫణిగిరి -గాజులబండ. అయితే ఇందులో తొలివిడత లో 8 నుంచి 10 సర్క్యూట్లపై ఫోకస్​ పెట్టింది. నల్లమల, రామప్ప, నాగార్జున సాగర్, వికారాబాద్, వరంగల్, చార్మినార్​, ట్రైబల్ సర్క్యూట్‌లను తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.

 Also Read: Aarogyasri: సర్కార్‌లో సూపర్ రికార్డు.. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి మేడ్చల్ నల్లగొండ టాప్​!

త్వరలోనే అధికారికంగా సర్క్యూట్‌లను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్క్యూట్లలో ఫుడ్ ప్లాజాలు, టాయిలెట్లు, ఆధునిక మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, హోటళ్లు, రిసార్ట్‌లు వంటి ఆధునిక సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అంతేగాకుండా ప్రత్యేక టూరిజం ప్రాంతాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ సౌకర్యాలు, వెల్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ టూరిజం, సాహస క్రీడల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ప్రతీ సర్క్యూట్‌ను దాని ప్రత్యేకతలను బట్టి సౌకర్యాలు కల్పించనున్నది. కాగా, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఈ సర్క్యూట్ల డెవలప్​‌మెంట్​లో కీలక పాత్ర పోషించనున్నది. రాష్ట్రంలోని 33 హరిత హోటళ్లు, 63 వాహనాల ఫ్లీట్‌తో టీజీటీడీసీ(తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ) ఇప్పటికే పర్యాటకులకు సేవలు అందిస్తోంది. భువనగిరి కోట వద్ద రాక్ క్లైంబింగ్, జన్నారం అడవుల్లో జీప్ రైడ్‌లు, హుస్సేన్ సాగర్‌లో పారాసైలింగ్ వంటి కార్యకలాపాలను టీటీటీడీసీ విజయవంతంగా నిర్వహిస్తున్నది.

నల్లమల సర్క్యూట్ : నల్లమల అడవుల సౌందర్యం, వన్యప్రాణుల అభయారణ్యాలు, ఎకో టూరిజంపై దృష్టి పెట్టనున్నారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, జీప్ రైడ్‌లు వంటి కార్యకలాపాలు పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళిక రూపొందించారు.

రామప్ప సర్క్యూట్ : యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం రామప్ప. ఆలయం చుట్టూ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. లక్నవరం సరస్సు, మేడారం, బొగత జలపాతం వంటి సమీప ప్రాంతాలను కలుపుతూ సమగ్ర ప్యాకేజీ రెడీ చేయనున్నారు. సాంస్కృతిక టూరిజంగా బాసిల్లనున్నది.

నాగార్జున సాగర్ సర్క్యూట్ :
బౌద్ధ వారసత్వం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంతోపాటు బుద్ధవనంలో వెల్‌నెస్, మెడిటేషన్ సెంటర్ల అభివృద్ధి, బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

వికారాబాద్ సర్క్యూట్:
హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్​ ఉంది. ఇక్కడ ఎకో టూరిజం, ఫారెస్ట్ రిసార్ట్‌లు, ట్రెక్కింగ్ కు అనువుగా ఉంటుంది.

వరంగల్ సర్క్యూట్:
వరంగల్ కోట, దాని చుట్టూ ఉన్న ఆలయాలు, చారిత్రక స్మారకాలతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక టూరిజంగా తీర్చిదిద్దనున్నారు.

ట్రైబల్ సర్క్యూట్:
భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యంతో గిరిజన సంస్కృతిని ప్రదర్శించే టూరిజం. ఆధ్యాత్మిక, ఎకో టూరిజంపై దృష్టి పెట్టనున్నారు.
చార్మినార్ సర్క్యూట్ :
హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్ బజార్, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి చారిత్రక స్థలాలతో సాంస్కృతిక టూరిజంగా తీర్చిదిద్దున్నారు. ఇవే కాకుండా యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, మెదక్, నల్గొండ, గోల్కొండ వంటి ఇతర ప్రాంతాలను కూడా సర్క్యూట్లలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.

గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలన్నదే లక్ష్యం
మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ టూరిజం పాలసీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించబోతుంది. టూరిజం రంగంలో గేమ్‌ ఛేంజర్‌గా ‘టూరిజం సర్క్యూట్లు’ నిలవబోతున్నాయి. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ సర్క్యూట్లు దేశ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించనున్నాయి. ఆధునిక సౌకర్యాలు, సాహస కార్యకలాపాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాం. నల్లమల అడవుల నుంచి చార్మినార్ చారిత్రక వీధుల వరకు, రామప్ప ఆలయం నుంచి నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వం వరకు ఈ సర్క్యూట్లు పర్యాటకులకు కనువిందుచేసేలా తీర్చిదిద్దుతాం. పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంతో ఫేజ్‌ల వారీగా అభివృద్ధి పనులు చేపడతాం. పర్యాటకశాఖకు ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

 Also Read: Vertex: మంఖాల్‌లో రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు