Shivabala Krishna (imagecredit:twitter)
తెలంగాణ

Shivabala Krishna: శివబాలకృష్ణకు ఈడీ అధికారులు ఝలక్

Shivabala Krishna: అవినీతి తిమింగలం శివబాలకృష్ణకు(Shivabala Krishna) ఎన్​ఫోర్స్ మెంట్​డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. ఆయన బినామీల పేర పెట్టుబడులు పెట్టిన మూడు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో దాడులు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. శివబాలకృష్ణ గతంలో రెరా(Rera) సెక్రటరీగా హెచ్​ఎండీఏ(HMDA)లో ప్లానింగ్ డైరెక్టర్​గా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అడ్డగోలుగా సంపాదించినట్టుగా ఆరోపణలు రావటంతో ఏసీబీ అధికారులు 2024, జనవరిలో దాడులు జరిపారు.

రాజేంద్రనగర్ లోని శివబాలకృష్ణ నివాసంతోపాటు చైతన్యనగర్లోని ఆయన సోదరుడు నడీన్​కుమార్, ఇతర బంధుమిత్రుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు జరిపారు. దీంట్లో హైదరాబాద్(Hyderabada)​, సిద్దిపేట(Sidhipeta), జనగామ(janagam), యాదాద్రి భువనగిరి, నాగర్​కర్నూల్​తదితర జిల్లాల్లో శివబాలకృష్ణకు 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. దాంతోపాటు విల్లాలు, ప్లాట్లు, ఫ్లాట్లు, భారీ స్థాయిలో బంగారం, ఖరీదైన కార్లు ఉన్నట్టుగా నిర్ధారించారు. అప్పట్లో ఏసీబీ(ACB) అధికారులు చెప్పిన ప్రకారం బహిరంగ మార్కెట్‌లో శివబాలకృష్ణ ఆస్తుల విలువ 250 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి.

Also Read: Ramchander Rao: మళ్లీ హస్తినకు బీజేపీ స్టేట్ చీఫ్.. అమిత్ షాతో భేటీ

రియల్ కంపెనీల్లో పెట్టుబడులు
ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో శివబాలకృష్ణ బినామీ పేర్ల మీద కొన్ని రియల్ ఎస్టేట్(Real estate) సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా వెల్లడైంది. దీంట్లో మనీలాండరింగ్​ జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులు శివబాలకృష్ణ ఆయన సోదరుడు నవీన్​కుమార్(Naveen Kumar)​ లను నిందితులుగా పేర్కొంటూ కొంతకాలం క్రితం ఈసీఐఆర్(ECIR) జారీ చేశారు. ఇటీవలే ఇద్దరి నివాసాల్లో తనిఖీలు కూడా జరిపారు.

తాజాగా…
ఇక శివబాలకృష్ణ బినామీల పేర పెట్టుబడులు పెట్టిన శ్రీకృష్ణ కన్​ స్ట్రక్షన్స్(Srikrishna Constructions)​, క్వారీస్​ స్పైసెస్(Quarries Spices)​, ఉదయ్​ ఎస్​ఎస్​వీ(Uday SSV) సంస్థల్లో సోదాలు జరిపారు. ఈ మూడు సంస్థలకు చెందిన కార్యాలయాలు లక్డీకాపూల్, కొండాపూర్(Kondapur), రామాంతాపూర్​లలో ఉండగా వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ క్రమంలో గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా కూడబెట్టుకున్న డబ్బును శివబాలకృష్ణ తన తమ్ముడు నవీన్​కుమార్‌తో కలిసి ఈ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లతోపాటు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Mallikarjuna Kharge: తెలంగాణలో కులగ‌ణ‌న దేశానికి దిశానిర్దేశం!

 

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?