HHVM Collections : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా హరి హర వీర మల్లు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా జూలై 24 న రిలీజ్ అయింది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే, కొన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ దూసుకెళ్తుంది. చాలా మందికి ఇప్పుడు ఒకటే సందేహం.. మొదటి రోజు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్స్ వచ్చాయని. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించాడో ? లేదో ఇక్కడ చూద్దాం..
Also Read: Team India: ఇంగ్లండ్‌తో నాలుగవ టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్‌కు పిలుపు?
హరిహర వీరమల్లు సినిమా ఒక రోజు ముందే ప్రీమియర్స్ షో లు వేశారు. రెండేళ్ల తర్వాత పవన్ స్క్రీన్ మీద కనపడటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. పవన్ కూడా ప్రమోషన్స్ చేయడంతో ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాదు, అడ్వాన్స్ సేల్స్ తోనే రూ. 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒకసారి హరి హర వీర మల్లు మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే.. పలు నివేదికల ప్రకారం, పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు.
హరి హర వీర మల్లు మొదటి రోజు కలెక్షన్స్
హరి హర వీర మల్లు – రూ.43.8 కోట్లు
వకీల్ సాబ్ – రూ.40.10 కోట్లు
భీమ్లా నాయక్ – రూ.37.15 కోట్లు
బ్రో – రూ. 30.5 కోట్లు
ఇక అడ్వాన్స్ సేల్స్, మొదటి రోజు కలిపి హరిహర వీరమల్లు సినిమా గ్రాస్ పరంగా దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని సమాచారం. దాదాపు రూ. 45 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందనట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గత మూడు సినిమాలు కంటే వకీల్ సాబ్, బ్రో, భీమ్లా నాయక్ సినిమాల కంటే ఎక్కువ. ఈ కలెక్షన్స్ బాక్సాఫీస్ సమాచారం మాత్రమే. చిత్ర బృందం నుంచి అధికారికంగా ఇంకా హరిహర వీరమల్లు మొదటిరోజు కలెక్షన్స్ ప్రకటించలేదు.
