Ponguleti srinivas reddy (imagecredir:twitter)
తెలంగాణ

Ponguleti srinivas reddy: 413 గ్రామాలకు నక్షా మ్యాప్‌లు.. త్వరలో తుది రూపం

Ponguleti srinivas reddy: దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను, ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తి చేశామని, వీలైనంత త్వరగా ఆ ఐదు గ్రామాల్లో సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం నక్షా మ్యాప్‌నకు తుది రూపం ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Min Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. సచివాలయంలో రీసర్వేపై ముఖ్యమంత్రి(CM) ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సర్వే ల్యాండ్‌సెటిల్‌మెంట్ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి 413 గ్రామాలకు నక్షాలు లేవని, గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఈ గ్రామాలను గాలికొదిలేసిందని విమర్శించారు.

పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాల్లో సర్వే నిర్వహించిందని తెలిపారు. మహబూబ్‌నగర్(Mehabubnagar) జిల్లా: గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల్ జిల్లా: భీర్‌పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్తది), ఖమ్మం(Khammam) జిల్లా: ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు(Mulugu) జిల్లా: వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా: వట్‌పల్లి మండలం షాహిద్ నగర్ ఈ గ్రామాల్లో డ్రోన్ / ఏరియల్, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్ధతుల్లో సర్వే నిర్వహించామని మంత్రి వివరించారు.

Also Read; Counterfeit Liquor: సూర్యాపేట కల్తీ మద్యం దందాలో ఆంధ్రా వ్యక్తులు

అభ్యంతరాల స్వీకరణ
నిబంధనల ప్రకారం భూ యజమానులకు నోటీసులు జారీ చేయడం, గ్రామ సభలు నిర్వహించి యజమానుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరి భూములకు సర్వే హద్దులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఐదు గ్రామాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(Collector Praveenya), సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఐదు గ్రామాలకు చెందిన ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు, సర్వే నిర్వహించిన ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజంలో సంచలనం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

 

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్