Kodi Ramakrishna Award ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kodi Ramakrishna Award : జీడికి “కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు”

Kodi Ramakrishna Award : కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్‌రైటర్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమా రంగంలో అనేక హిట్ చిత్రాలను అందించారు. ఆయన సినిమాలు విభిన్న శైలుల్లో, ముఖ్యంగా భక్తి, ఫాంటసీ, సామాజిక నేపథ్య చిత్రాల్లో ఆయన మార్కు కనిపిస్తుంది. కోడి రామకృష్ణ అనేక అవార్డులను అందుకున్నారు. అంత పేరు సంపాదించుకున్న ఆయన పేరు మీద “కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు” లను అందజేస్తున్నారు.

Also Reda: Aata Sandeep: బిగ్ బాస్ సందీప్ మాస్టర్ తన భార్యను అంతలా టార్చర్ చేశాడా.. వెలుగులోకి నమ్మలేని నిజాలు ?

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన జీడి ప్రసాద్ “కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు” అందుకున్నారు. హైదరాబాద్, బంజారా హిల్స్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో కళాకారులకు అవార్డులు అందించారు. “కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు” తెలుగు సినిమా నిర్మాత, కమిటీ ఫౌండర్, చైర్మన్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కమిటీ చైర్మన్ హరీష్ శంకర్ (గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్) వివిధ రంగాల కళాకారులకు ఈ అవార్డులను అందించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర హస్తకళ అవార్డు గ్రహిత జీడి ప్రసాద్ హస్త కళాకారుడిగా చేస్తున్న సేవకు గుర్తింపుగా ‘కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు’కు ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు అల్లరి నరేష్, శివాజీ, మురళీ మోహన్, నిహారిక, కవిత పాల్గొన్నారు.

Also Reda: Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!

Just In

01

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!

Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!

Telangana Politics: కాంగ్రెస్ స్కెచ్‌కి ఇరుక్కుపోయిన బీఆర్ఎస్.. ఎలా అంటే..?

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్