Hari Hara Veera Mallu Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ” హరి హర వీరమల్లు ” సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సినీ లవర్స్ కి కూడా గుర్తుండి పోతుంది. ఎందుకంటే, ఈ సినిమా బొమ్మ వెండితెర మీద పడటానికి ఎన్నో సవాళ్ళను అధిగమించి థియేటర్లలో నేడు రిలీజ్ అయింది. అయితే, ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరి, ఈ సినిమా కథ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎలా నటించాడనేది రివ్యూ లో పూర్తిగా తెలుసుకుందాం..
హరి హర వీరమల్లు మూవీ రివ్యూ (Hari Hara Veera Mallu Review)
నటీనటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, అనూపమ్ ఖేర్
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఏ.ఎం. రత్నం, ఎ. దయాకర్ రావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్
విడుదల తేదీ: జులై 24, 2025
కథ (Story):
16వ శతాబ్దంలో, ధనవంతుల దగ్గర దోచి పేదలకు పంచే రాబిన్ హుడ్‌లాంటి హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. అతని ధైర్యం, తెలివి, నీతి ప్రజలను ఆకర్షిస్తాయి. ఒక రోజు, చిన్నదొర (సచిన్ కేడ్కర్) వీరమల్లుకు మొఘల్ సైన్యం నుంచి వజ్రాలు దొంగిలించే బాధ్యతను అప్పగిస్తాడు. ఈ సాహసోపేతమైన పనిలో, వీరమల్లు అందమైన పంచమి (నిధి అగర్వాల్)ని కలుస్తాడు. వజ్రాలతో పాటు, పంచమిని చిన్నదొర బంధనం నుంచి విడిపించాలనుకున్నాడు వీరమల్లు. అనుకోని ఒక ఘట్టంలో వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఊహించని ఎదురుదెబ్బను ఎదుర్కొంటాడు. హైదరాబాద్ చక్రవర్తి అతన్ని బంధించి, ఒక అసాధ్యమైన సవాల్‌ను అప్పగిస్తాడు— ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు (బాబీ డియోల్) పరిరక్షణలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకుని తీసుకురావాలని ఆదేశిస్తాడు. ఈ ధైర్యసాహసాల ప్రయాణంలో వీరమల్లు దిల్లీ చేరుకుంటాడు, కానీ అక్కడ అతన్ని అడుగడుగునా ప్రమాదాలు, శత్రువులు, మరియు ఊహించని ఆటంకాలు వెంటాడతాయి. దాంతో ఢిల్లీ ప్రయాణమైన వీరమల్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదిరించాడు? ఔరంగజేబును ఓడించి, కోహినూర్ ను తీసుకురాగలిగాడా? లేదనేది “హరిహర వీరమల్లు” చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్‌లో మొదటిసారి పీరియాడిక్ డ్రామాలో నటించారు. వీరమల్లు పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు, హీరోయిజం ఈ చిత్రానికి ప్రాణం పోశాయనే చెప్పుకోవాలి. ఫ్యాన్స్‌కు ఫస్ట్ హాఫ్‌లోని ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ-క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి.
ఎం.ఎం. కీరవాణి సంగీతం: కీరవాణి సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ‘అసుర హననం’ వంటి పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు భావోద్వేగ లోతును జోడించాయి. పాటలు స్క్రీన్‌పై చూస్తే మరింత ఆకట్టుకున్నాయి.
విజువల్స్ యాక్షన్: సినిమాటోగ్రఫీ (మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్) , ఆర్ట్ డైరెక్షన్ (తోట తరణి) అద్భుతంగా ఉన్నాయి. పోర్ట్ ఫైట్ సీన్ , ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోయాయి.
ఫస్ట్ హాఫ్: ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, కథనం ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్: సెకండ్ హాఫ్ కొంచం స్లో గా అనిపించింది. ఎడిటింగ్, గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే చాలా బాగుండేది.
మొత్తం మీద:
‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ తెచ్చింది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. అయితే సెకండ్ హాఫ్‌లో కొంత లాగ్ , గ్రాఫిక్స్‌లో లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా, సనాతన ధర్మం నేపథ్యంలో హీరోయిజంతో ఈ సినిమా నిలుస్తుంది.
రేటింగ్: 3/5
సినిమా గురించి ఒక్క మాటలో చేప్పాలంటే : పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్, సినీ ప్రేక్షకులకు మంచి యాక్షన్ డ్రామా!