Tanushree Dutta ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tanushree Dutta: నా ఇంట్లో వాళ్లే నన్ను వేధిస్తున్నారు.. బాలీవుడ్ నటి సంచలన వీడియో

Tanushree Dutta: బాలీవుడ్ నటి  తనుశ్రీ దత్తా సంచలన వీడియో షేర్ చేసింది.  “నా సొంత ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు”బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, 2018లో భారతదేశంలో #MeToo ఉద్యమానికి ముందుండి నడిపించిన వ్యక్తిగా పేరుపొందింది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక షాకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె కన్నీళ్ళు పెట్టుకుని, తన సొంత ఇంట్లో గత 4-5 సంవత్సరాలుగా వేధింపులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సహాయం కోసం ఆమె పోలీసులను సంప్రదించినట్లు తెలిపింది.

నా సొంత ఇంట్లో వాళ్లే నన్ను వేధిస్తున్నారు.. తనుశ్రీ దత్తా

ఆమె షేర్ చేసిన వీడియోలో “నా సొంత ఇంట్లో వాళ్లే నన్ను వేధిస్తున్నారు. నాకు ఏం చేయాలో తెలియక పోలీసులను సంప్రదించాను. వారు నన్ను స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. నేను రెండు రోజుల్లో అక్కడికి వెళతాను. ప్రస్తుతం, నా ఆరోగ్యం బాగలేదు. గత 4-5 సంవత్సరాలుగా ఈ వేధింపుల వల్ల నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నేను నా పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా ఇల్లు గజిబిజిగా మారింది. నేను ఇంట్లో పనిమనిషిని కూడా నియమించలేను, ఎందుకంటే కొందరు నా ఇంట్లో పనిమనిషిగా వచ్చి దొంగతనాలు చేశారు. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి” అంటూ ఆమె ఏడుస్తూ చెప్పుకొచ్చింది.

నేను ఈ వేధింపులతో విసిగిపోయాను.. 

తనుశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. “నేను ఈ వేధింపులతో విసిగిపోయాను.. ఇది 2018 #MeToo నుండి కొనసాగుతోంది. ఈ రోజు నేను విసిగిపోయి పోలీసులను సంప్రదించాను. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి. ఆలస్యం కాకముందే ఏదైనా చేయండి.

వింత శబ్దాలు వస్తున్నాయి.. 

ఆమె షేర్ చేసిన ఇంకో వీడియోలో, 2020 నుండి తన ఇంటి పైకప్పు మీద, తలుపు వెలుపల శబ్దాలు, కొట్టడాలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ ఒత్తిడి కారణంగా ఆమెకు క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వచ్చిందని, హిందూ మంత్రాలతో హెడ్‌ఫోన్స్ ధరించి తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటున్నానని తెలిపింది.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?