Tahsildar Report ( image Credit: twitter)
తెలంగాణ

Tahsildar Report: ముఖ్యమంత్రి రేవంత్ చేతికి తహశీల్దార్ల రిపోర్ట్?

Tahsildar Report: రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్లపై ప్రభుత్వం ఓ నివేదిక తయారు చేసింది. అన్ని జిల్లాల్లోని తహశీల్దార్లపై ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక రిపోర్ట్‌ను సేకరించింది. అవినీతికి పాల్పడుతున్నదెవరు? ప్రజలతో ఎలాంటి సంబంధాలను మెయింటెన్ చేస్తున్నారు? ప్రభుత్వం సూచిస్తున్న ప్రోగ్రామ్‌లను సమర్​ధవంతంగా పూర్తి చేస్తున్నారా? అనే తదితర అంశాలలో అధ్యయనం చేసినట్లు తెలిసింది. కొందరు తహశీల్దార్ల గ్రాఫ్ లేదని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి,  (Revanth Reddy )మంత్రి పొంగులేటితో డిస్కషన్ చేసినట్లు తెలిసింది.

 Also Read: New NCERT book: విద్యార్థుల పాఠ్యపుస్తకంలో శుభాంశు శుక్లా సందేశం.. ఇంతకీ ఏం చెప్పారంటే?

రెవెన్యూ శాఖ సీరియస్‌

తాను కూడా మరోసారి రిపోర్ట్ తెప్పించుకొని పరిశీలిస్తానని మంత్రి పొంగులేటి ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. అయితే, త్వరలోనే అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ప్రజాప్రభుత్వంలో తప్పిదాలు, నిర్లక్ష్యం వహించే అధికారులకు ప్రయారిటీ ఇవ్వకూడదని సీఎం సూచించిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ (Department of Revenue) సీరియస్‌గా వ్యవహరించనున్నది. ఇక ఇప్పటికే కొందరి కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తితో ఉన్న మంత్రి పొంగులేటికి, తహశీల్దార్ల రిపోర్ట్ కూడా చిక్కుముళ్లు పెట్టింది. ప్రజలకు మేలు చేసేందుకు తప్పు చేసే అధికారులను విడిచిపెట్టేది లేదని మంత్రి పొంగులేటి నొక్కి చెప్పారు.

 Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

Just In

01

Bride Market: అక్కడ వధువుల మార్కెట్.. ఒక్క అమ్మాయిని కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

The Girlfriend review: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ జెన్యూన్ రివ్యూ.. రష్మిక ఏం మాయ చేసిందో చూడాలంటే….

Kishan Reddy: మేము డబ్బులివ్వం.. ఓటు మాత్రం మాకే వేయండి: కిషన్ రెడ్డి

TG Mining Department: మైనింగ్ శాఖలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. కారణం అదేనా..?

Singareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!