TET 2025 Results ( image CREDIT: SWETCHA reporter)
తెలంగాణ

TET 2025 Results: 90,205 మందికి 30,649 మంది ఉత్తీర్ణత!

TET 2025 Results: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(తెలంగాణ టెట్)2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా (Yogita Rana) ఫలితాలను విడుదల చేశారు. జూన్‌ 18 నుంచి 30వ తేదీ మధ్య 16 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా ఆన్‌లైన్‌ మోడ్‌లో పరీక్షలు జరిగాయి. టెట్ పరీక్షకు మొత్తం 1,83,653 మంది దరఖాస్తు చేసుకోగా 90,205 మంది హాజరయ్యారు. ఇందులో 30,649 మంది ఉత్తీర్ణత సాధించారు.

 Also Read: Chandrababu: ఏపీలో పంటల వివరాలపై సమగ్రంగా ‘శాటిలైట్ సర్వే’

29,043 మంది ఉత్తీర్ణత

కేవలం 33.98 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 1 ఆరు సెషన్లలో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాళీలో నిర్వహించారు. పేపర్ 2 పది సెషన్లలో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో గణితం, విజ్ఞానశాస్త్రం, లేదా సాంఘీక శాస్త్రం విషయ నిపుణతో నిర్వహించారు. పేపర్ 1కు 47,224 మంది హాజరుకాగా 29,043 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్‌లో 48,998 మంది హాజరుకాగా 17,574 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్ఎస్టీకి 41,207 మంది హాజరుకాగా 13,075 పాసయ్యారు.

 Also ReadPawan Kalyan: 2019లో ఓడిపోయినప్పుడు.. ‘జానీ’ ఫెయిల్యూర్ నాకు బాగా హెల్ప్ చేసింది

Just In

01

Bride Market: అక్కడ వధువుల మార్కెట్.. ఒక్క అమ్మాయిని కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

The Girlfriend review: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ జెన్యూన్ రివ్యూ.. రష్మిక ఏం మాయ చేసిందో చూడాలంటే….

Kishan Reddy: మేము డబ్బులివ్వం.. ఓటు మాత్రం మాకే వేయండి: కిషన్ రెడ్డి

TG Mining Department: మైనింగ్ శాఖలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. కారణం అదేనా..?

Singareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!