Shilpa Shirodkar Family
ఎంటర్‌టైన్మెంట్

Shilpa Shirodkar: తను టెన్త్ ఫెయిల్.. భర్త డబుల్ ఎంబీఏ.. నమ్రత చెల్లి గురించి ఈ విషయాలు తెలుసా?

Shilpa Shirodkar: శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా ఈ పేరు తెలియక పోవచ్చు కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) చెల్లెలు అంటే అందరికీ ఓ ఐడియా వస్తుంది. ఎందుకంటే.. నమ్రత, శిల్పా.. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ. ఆ విషయం పలు సందర్భాలలో నిరూపితమైంది కూడ. మరో విషయం ఏమిటంటే శిల్పా శిరోద్కర్ కూడా నటే. బాలీవుడ్‌లో ఆమెకు మంచి పేరుంది. తెలుగులో కూడా ఆమె మోహన్ బాబు సరసన ఓ సినిమా చేసింది. ఇటీవల హిందీ బిగ్ బాబు 18లో పాల్గొని, తెలియని వారెందరికో కూడా ఆమె పరిచయమైంది. ఒక గొప్ప ఫ్యామిలీకి చెందిన ఆమె బిగ్ బాస్ 18లో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడే ఆమె ఘట్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. అలాంటి నటి తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 25 ఏళ్ల వైవాహిక బంధాన్ని పురస్కరించుకుని ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read- Pawan Kalyan: 2019లో ఓడిపోయినప్పుడు.. ‘జానీ’ ఫెయిల్యూర్ నాకు బాగా హెల్ప్ చేసింది

మిథున్ చక్రవర్తి భ్రష్టాచార్‌ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన శిల్పా శిరోద్కర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అందరినీ వదిలి భర్తతో కలిసి ఆమె న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. తాజాగా తన ఇచ్చిన ఇంటర్వ్యూలో శిల్పా మాట్లాడుతూ.. ‘‘నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను. నా భర్త మాత్రం డబుల్ ఎంబీఏ పొందారు. బ్యాంకర్ జాబ్ చేస్తున్నారు. ఆయన బాగా చదువుకున్నవాడైనా, తెలివితేటలు ఉన్నవాడైనా, నేనెప్పుడూ తక్కువ అనే భావన రాకుండా నన్ను చూసుకున్నారు. నేను కూడా తక్కువ చదివానే అనే భావించలేదు. మా మధ్య ఎడ్యుకేషన్ పరంగా తేడాలు ఉన్నప్పటికీ, ఇద్దరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. అందుకే మా వైవాహిక జీవితం ఇంత బలంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. 2000లో సినిమాలకు బై చెప్పిన శిల్పా శిరోద్కర్.. మళ్లీ 13 సంవత్సరాల తర్వాత 2013లో జీ టీవీ సీరియల్‌లో నటించి, నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. 2024లో జరిగిన బిగ్ బాస్ 18లో అడుగుపెట్టి మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

Also Read- Marriage: పెళ్లి కాని ప్రసాద్‌లకు దడ పుట్టించే వార్త.. వెంటనే చెక్ చేస్కోండి!

ఇక శిల్పా శిరోద్కర్, అపరేష్ రంజిత్‌ల వివాహమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, సోషల్ మీడియా వేదికగా హృదయాన్ని హత్తుకునేలా ఆమె ఓ పోస్ట్ చేశారు. అందులో.. ‘‘మంచిచెడులో, కష్టసుఖాల్లో.. 25 సంవత్సరాల తర్వాత కూడా నా ఛాయిస్ నువ్వే. ఈ విజయవంతమైన స్త్రీ వెనుక ఉన్న గొప్ప వ్యక్తివి నువ్వే’’ అని పేర్కొన్నారు. అపరేష్ రంజిత్‌‌‌ని మొదటిసారి కలిసిన తర్వాత, కేవలం ఒకటిన్నర రోజుల్లోనే అతనితో పెళ్లికి ఓకే చెప్పానని శిల్పా తెలిపారు. అపరేష్ నిజాయితీ తనని ఆకర్షించిందని, అతనితో పెళ్లి తర్వాత భారత దేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని తెలిసినా.. ఎటువంటి సందేహం తనకు కలగలేదని అన్నారు. ముఖ్యంగా ముంబైలో ఉన్న అందరినీ, అక్కడి ఆప్యాయతని వదిలి, తన భర్త వెంట న్యూజిలాండ్ వెళ్లేందుకు తనే సొంతంగా నిర్ణయం తీసుకున్నానని శిల్పా చక్రవర్తి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు