Hari Hara Veera Mallu Still
ఎంటర్‌టైన్మెంట్

HHVM: ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్.. పోలీసులు విధించిన షరతులివే?

HHVM: హైదరాబాద్‌లో సినిమాలకు సంబంధించి గ్రాండ్ ఫంక్షన్స్ నిర్వహించడం పెద్ద కష్టంగా మారింది. భారీ ఫంక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం, పోలీసులు చాలా ఆంక్షలు విధిస్తున్నారు. అందుకు కారణం ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనే. ఆ ఘటన తర్వాత సినిమా ఫంక్షన్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ వేడుకలకు అనుమతి ఇవ్వడం లేదు. ఒక వేళ ఇస్తే మాత్రం చాలా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) హైదరాబాద్, శిల్పకళా వేదికలో జరిగే ప్రీ రిలీజ్ వేడుక విషయంలోనూ అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. తాజాగా పోలీసుల నుంచి క్లియరెన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. ఆ షరతులు ఏమిటంటే..

Also Read- Pawan Kalyan: అందుకు నాకు పొగరో, అహంకారమో కారణం కాదు.. ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుంచి దాదాపు మూడు రీమేక్ సినిమాల తర్వాత వస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేయని చారిత్రక యోధుడి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతుండటంతో, సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా విడుదల విషయంలో అనేక సార్లు వాయిదా పడినప్పటికీ, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తో, మళ్లీ అంచనాలు పుంజుకున్నాయి. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలోకి పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యారు. సోమవారం జరిగే ప్రీ రిలీజ్ వేడుక అనంతరం, ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

Also Read- Mohan Babu: కోట చనిపోయిన రోజు హైదరాబాద్‌లో లేను.. అందుకే?

మొదట ఈ ప్రీ రిలీజ్ వేడుకను రెండు చోట్ల నిర్వహిస్తున్నారనేలా వార్తలు వచ్చాయి. వారణాసి, తిరుపతి పట్టణాలలో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించాలని భావించారు. కానీ, పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటే ప్రీ రిలీజ్ వేడుక, అదీ కూడా హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. కాకపోతే, హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక అంటే అంత తొందరగా అనుమతులు వచ్చే పరిస్థితులు లేవు. కానీ, ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో.. కొన్ని షరతులతో హైదరాబాద్ పోలీసులు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులు ఇచ్చారు. కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల మంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కావాలని, ఈ వేడుకకు సంబంధించి పూర్తి బాధ్యత నిర్మాతే వహించాలని పోలీసులు కండీషన్స్ విధించారు. ఈ వేడుక బయట ఉండే క్రౌడ్‌ని కంట్రోల్ చేసుకునే బాధ్యత‌తో పాటు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పూర్తి బాధ్యత నిర్మాతే తీసుకోవాల్సి ఉంటుందని తెలుపుతూ.. ఈ వేడుకకు అనుమతులు జారీ చేశారు. పోలీసులు విధించిన ఈ కండీషన్స్‌తో మేకర్స్ కట్టుదిట్టంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. అందుకే ముందే, కేవలం పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులు ఎవరూ రావద్దని మేకర్స్ స్ట్రిక్ట్‌గా తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు