Pawan Kalyan Speech (Image Source: twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Pawan Kalyan: రాజకీయంగా పేరున్నా.. ఆ హీరోల కంటే తక్కువే.. పవన్ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా దేశవ్యాప్తంగా పేరున్నప్పటికీ.. తాను ఇండస్ట్రీలోని కొందరు హీరోలతో పోలిస్తే తక్కువేనని పవన్ అన్నారు.

సినిమాలపై దృష్టి పెట్టలేదు
హరిహర వీరమల్లు ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్.. సినిమా పరంగా మీడియాతో మాట్లాడటం తన జీవితంలో ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. అంతేకాదు సినిమాల పరంగా చూస్తే చాలా మంది హీరోలతో పోలిస్తే తాను తక్కువ అని పవన్ అన్నారు. ‘నాకు పొలిటికల్ గా పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చు. సినిమా పరంగా చూస్తే నేను చాలా మంది హీరోలతో పోలిస్తే చాలా తక్కువ. దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతావారికి బిజినెస్ అయినంతగా నాకు బిజినెస్ కాకపోవచ్చు. వాళ్లకు వచ్చినంతగా నాకు రాకపోవచ్చు’ అని పవన్ అన్నారు. ఎందుకుంటే తన కాంపిటీటివ్ దృష్టి ఎప్పుడు సినిమాపై పెట్టలేదని పవన్ అన్నారు. సమాజం, రాజకీయాలపై తన దృష్టి పెట్టానని సినిమాలపై తన ఫోకస్ లేదని చెప్పుకొచ్చారు.

టాలెంట్ లేకపోతే కష్టం
భారతీయ సినిమాకు కుల, మత భేదాలు లేవని పవన్ కల్యాణ్ అన్నారు. కేవలం క్రియేటివిటీ మీదనే సినీ పరిశ్రమ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ‘నువ్వు చిరంజీవి గారి తమ్ముడివి కావొచ్చు. చిరంజీవి గారి కొడుకు కావొచ్చు. లేదంటే ఇంకొకరి అబ్బాయి కావొచ్చు.. మేనల్లుడు అవ్వొచ్చు. ఇది అసలు మ్యాటరే కాదు. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు. సత్తా లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేవు. అది నా కొడుకు అయినా సరే. నువ్వు ఎంత నిలబెట్టుకోగలవు.. ఎంత నిలదొక్కుకోగలవు.. ప్రతీకూలతో ఎంత బలంగా నిలబడగలవు అన్న దానిపై నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది’ అని పవన్ చెప్పుకొచ్చారు.

Also Read: Women Avoid These Foods: పీసీఓఎస్‌తో బాధపడున్నారా? వర్షాకాలంలో ఈ ఆహారం అస్సలు తీసుకోద్దు!

‘నాకే సిగ్గేసింది’
హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా చూసిన నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. సినిమా ప్రమోషన్ ను ఆమె తన భుజాల మీద వేసుకొని కష్టపడటాన్ని చూసి తనకే బాధేసిందని అన్నారు. ‘తన కెరీర్ చూసుకోవాల్సిన అమ్మాయి.. ఇలా కష్టపడుతుంటే నాకే సిగ్గేసింది. సినిమాను అనాథను చేశానన్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాను అనాథలా వదల్లేదు. నేను ఉన్నాను అని చెప్పడానికి ఈరోజు వచ్చాను’ అని పవన్ అన్నారు. అంతకుముందు మరో చమత్కారమైన మాటలు సైతం పవన్ అన్నారు. ప్రెస్ మీట్ ప్రారంభం కంటే చాలా ముందు వచ్చినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం అయ్యి.. పొగరు చూపిస్తున్నారని ఎవరూ అనుకోకూడదని ఇలా చేసినట్లు నవ్వుతూ పవన్ చెప్పారు.

Also Read This: Gold Rate Today: అయ్య బాబోయ్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ ఎంతంటే?

Just In

01

ICC Women’s World Cup 2025 Final: రేపే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఢీ.. బలాబలాలలో ఎవరిది పైచేయి!

Crime News: లక్షల విలువ చేసే హాష్​ ఆయిల్​ గంజాయి సీజ్.. ఎక్కడంటే?

Bank Holidays November 2025: నవంబర్ 2025 బ్యాంకు హాలిడే లిస్ట్.. ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు మూసివేత!

Champion teaser: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు ఇరగదీశాడు.. చూశారా మరి..

Etela Rajender: గురుకులాల్లో ఆత్మహత్యలు.. సౌకర్యాల కొరత, పర్యవేక్షణ లోపంపై.. ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన