Caste Census
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana: కులగణన డేటా.. తెలంగాణ హెల్త్ చెకప్ కూడా

Telangana:

సర్వే సైంటిఫిక్.. అథెంటిక్.. రిలయబుల్
ప్రభుత్వానికి ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక
300 పేజీలతో పూర్తి స్థాయి రిపోర్ట్ సమర్పణ
రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలు
ఎస్సీలు 61 లక్షలు.. ఎస్టీలు 37 లక్షలు
నిపుణుల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
కమిటీ సూచనలపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయాలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో (Telangana) నిర్వహించిన కులగణన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని ఎక్స్‌పర్ట్ కమిటీ ప్రశంసించింది. కులగణనపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన కమిటీ సంతృప్తి చెంది ప్రభుత్వానికి శనివారం 300 పేజీలతో నివేదికను సమర్పించింది. తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను, సూచనలను క్యాబినెట్‌లో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నది.

సర్వే వివరాలు

సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సమగ్ర కుల గణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42%), ఎస్టీలు 37,08,408 మంది (10.43%) ఉండగా, బీసీలు ఏకంగా 2,00,37,668 మంది (56.36%) ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఇక, ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది (15.89%) మంది ఉన్నట్లు వెల్లడించారు. గతంలోనే ఈ సర్వే వివరాల నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. మరింత పారదర్శకత కోసం సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి అప్పగించింది. అయితే, వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ డేటాను సేకరించిన పద్దతి నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, వెనుకబడిన బలహీనవర్గాల వర్గాల అభ్యున్నతిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని సూచించింది.

Read Also- Health News: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా?. కారణం ఇదే!

ప్రభుత్వానికి వివరణ

ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణులు శనివారం సమావేశమయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనగా, కమిటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె అయిలయ్య, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, సుఖదేవ్ తొరాట్, నిఖిల్, భాంగ్య భూక్య, పురుషోత్తం రెడ్డి, జీన్ డ్రెజ్, థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, సెక్రెటరీ అనుదీప్ దురిశెట్టి తమ నివేదికను ప్రభుత్వానికి వివరించారు.

సర్వే జరిగిందిలా..

మొదటి దశలో 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా ఎంచుకున్నారు. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్‌ను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించారు. మొదటి విడుతలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ చేయించారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవడంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడుతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ఎంపీడీవో ఆఫీసులు, వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలకు నమోదు చేయించారు.

Read Also- Viral News: 9 నెలల్లో మృత్యువు.. విలువైన సలహాలు కోరిన యువతి

ఇది మెగా హెల్త్ చెకప్: సీఎం రేవంత్ రెడ్డి
‘‘ఇది కేవలం డేటా కాదు తెలంగాణ మెగా హెల్త్ చెకప్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది. అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకు కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని కోరుతున్నా. ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరుతున్నా. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్