Namrata Shirodkar: టాలీవుడ్ లో తెలుగు హీరో మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువ ఫ్యామిలీతోనే మహేష్ బాబు గడుపుతుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ మేన్. అయితే, తాజాగా కూతురు సితార ఘట్టమనేని బర్త్ డే సందర్భంగా సితార సోదరుడు గౌతమ్ ఘట్టమనేని,ఆయన భార్య నమ్రత శిరోద్కర్ తమ కూతురు 13వ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్‌లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Also Read: Nikhil Siddhartha: వాటర్ బాటిల్స్ ని కూడా లోపలికి తెచ్చుకోనివ్వరా.. హీరో నిఖిల్ సంచలన ట్వీట్
ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు ఫొటోలతో పాటు ఎమోషనల్ సందేశాలు కూడా రాసుకొచ్చారు. సితార సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే పోస్ట్ పెట్టాడు. మహేష్ బాబు, సితారతో క్రిస్మస్ వేడుకల సమయంలో తీసిన ఫొటోను షేర్ చేశారు.
ఈ ఫొటోలో సితార ఉల్లాసంగా పోజ్ ఇస్తుండగా, మహేష్ ఆమె వైపు చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మరో ఫొటోలో సితార అందంగా రెడీ అయినట్లు కనిపించింది.
Also Read: Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!
“ఇప్పుడు నీవు ఇంత ఆత్మవిశ్వాసంతో, బలమైన యువతిగా మారావు, నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది” సితారతో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ నమ్రత ఇలా రాసింది, “పుట్టినరోజు శుభాకాంక్షలు, నా బంగారానికి ” ఆమె తన పోస్ట్‌కు క్యాప్షన్‌గా “నీవు ఎంత ఎదిగినా, నా చేతిని మొదటగా పట్టుకుని నా లోకాన్ని శాశ్వతంగా మార్చిన ఆ చిన్ని చేయి నీదే. పుట్టినరోజు శుభాకాంక్షలు సితార ఘట్టమనేని.. నా ప్రేమ నీకు ఎప్పటికీ అండగా ఉంటుంది అంటూ రాసుకొచ్చింది.
Also Read: Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. నిర్లక్ష్యం చేయోద్దు.. క్యాన్సర్ కావొచ్చు!