Fish Venkat: టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, విలన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన వెంకట్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందాడు. ఈయన గత కొంతకాలం నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన, హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన రెండు కిడ్నీలు పాడైనట్లు డాక్టర్స్ నిర్ధారించారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం కోసం ఫిష్ వెంకట్ కుమార్తె మూడు రోజుల క్రితం మీడియా ద్వారా సహాయం కోరినా, ఎవరూ చేయలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిడ్నీ మార్పిడి సాధ్యపడలేదని సమాచారం. ఈ విషాదం టాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కుమార్తె సంచలన విషయాలను వెల్లడించింది.
వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో మొదట ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే తొలి వారంలోనే రూ.4 లక్షలు ఖర్చయ్యాయి. తర్వాత PRK ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందినప్పటికీ, లివర్ సమస్య, రక్త సంక్రమణ వంటి కారణాలతో ఇన్ఫెక్షన్ మెదడుకు చేరి, ఆయన చివరకు మూడు రోజులుగా కోమాలోకి వెళ్లారని ఫిష్ ఫిష్ వెంకట్ కుమార్తె తెలిపారు. చికిత్సకు దాదాపు రూ.50 లక్షలు అవసరమని తెలియడంతో, సినీ పరిశ్రమ నుంచి సాయం కోరారు. అయినప్పటికీ, పలువురు ప్రముఖులను సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాత దిల్ రాజు, సోను సూద్ వంటి వారు సహాయం చేస్తామని హామీ ఇచ్చి, తర్వాత ఫోన్ కూడా ఎత్తలేదని ఆమె చాలా బాధపడ్డారు.