Hyd metro timings
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad Metro: భాగ్యనగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad metro rail timings changed night service extended 45 minitues:


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో నిర్వాహకులు శుభవార్త అందించారు. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక పక్క ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ తక్కువ ధరకే ఏసీలో ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో మంచి సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అయితే రాత్రిపూట ప్రయాణించేవారికి..ముఖ్యంగా ఆలస్యంగా ప్రయాణించేవారికి మెట్రో అందుబాటులో ఉండదనే అపవాదు ఉంది. ఎందుకంటే రాత్రి 11 గంటలకు చివరి మెట్రో నడుస్తన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సమయాన్ని మరింత పెంచారు. ఇక నుంచి మెట్రో చివరి ట్రిప్ రాత్రి 11.45 గంటలకు ఉండనుంది.

సోమవారం ఒక్క రోజే ఆ సమయం


కొన్ని కార్యాలయాలలో రాత్రి 10 గంటల దాకా డ్యూటీ చేసుకుని మెట్రో రైలును అందుకోలేక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికి ఈ సర్వీసు బాగా ఉపయోగపడనుంది. ఉదయాన 6 గంటలకు ప్రారంభం అయ్యే మెట్రో వేళలలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇప్పటిదాకా ఉదయం 6 గంటలకు తొలి ట్రిప్ ప్రారంభం అయ్యేలా మెట్రో ను నడిపారు. ఇకపై ఉదయం 5.30 నిమిషాలకు తొలి ట్రిప్ ప్రారంభమవుతుందని వివరించారు మెట్రో అధికారులు. అయితే ఇది వారంలో ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండనుంది. సోమవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ ఒక్క రోజు మాత్రమే ఉదయం 5.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మిగిలిన ఆరు రోజులూ ఉదయం 6 గంటలకు యథావిధిగా మెట్రో సర్వీసులు ఉంటాయని అంటున్నారు. సోమవారం సగటున రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో 45 నిమిషాలు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

Just In

01

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?

Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

CP Sajjanar: తాగి డ్రైవింగ్ చేస్తే వాళ్ళు టెర్రరిస్టులు: సీపీ సజ్జనార్

Cobra Snake Video: ఏకంగా పాముతో లిప్ కిస్.. వీడెంటి బాబోయ్ ఇలా చేస్తున్నాడు? వీడియో వైరల్