Nikhil Siddhartha: సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి మల్టీప్లెక్స్ థియేటర్లలో అధిక టికెట్ ధరలు. ఇది మాత్రమే కాకుండా అంతేకాదు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్‌ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీని పై ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు కూడా రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది.
టికెట్ ధరలపై ఒక పరిమితి ఉండాలి.. హీరో నిఖిల్ సిద్దార్థ
తాజాగా, హీరో నిఖిల్ సిద్దార్థ కూడా దీని పై రియాక్ట్ అయ్యాడు. ఈ అధిక ధరలపై తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసి వెల్లడించాడు. నిఖిల్ తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చాడు ” టికెట్ ధరలపై ఒక పరిమితి ఉండాలి. అయితే, అంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్‌ను కూడా ఖరీదైన ధరలకు అమ్ముతున్నారు. ఇటీవల నేను ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూశాను, కానీ అక్కడ నేను చూసిన సినిమా టికెట్ కంటే స్నాక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. బిగ్ స్క్రీన్‌పై సినిమాలను ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలంటే, ఈ సమస్యను తప్పక పరిష్కరించాలని కోరాడు.
వాటర్ బాటిల్స్ అయినా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతించండి
At least allow us to take our Water bottles into the Theatres .
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 19, 2025
అంతే కాదు, కనీసం వాటర్ బాటిల్స్ అయినా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతించండంటూ అతను ట్వీట్ లో రాసుకొచ్చాడు. ” మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు ఎప్పటికి తగ్గుతాయో చూడాలి. ప్రస్తుతం నిఖిల్ సిద్దార్థ ‘స్వయంభు’, ‘ది ఇండియన్ హౌస్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. సడెన్ గా నిఖిల్ అతని అభిప్రాయాన్ని ఈ ట్వీట్ ద్వారా తెలపడంతో సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
High Ticket Rates Should be capped.. but the bigger issue is Selling PopCorn and CoolDrinks at Insane prices.. i watched a recent film in a theatre and was shocked i spent more money on snacks than the actual Movie.
I Request the Distribution circles to please address this… pic.twitter.com/csJv9KQ5rb— Nikhil Siddhartha (@actor_Nikhil) July 19, 2025