Fish Venkat: టాలీవుడ్‌లో మరో బాధాకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఫిష్ వెంకట్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం కోసం ఫిష్ వెంకట్ కుమార్తె రెండు రోజుల క్రితం మీడియా ద్వారా సహాయం కోరినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిడ్నీ మార్పిడి సాధ్యపడలేదని సమాచారం. ఈ విషాదం టాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచెత్తింది.
Also Read: Gandhi Nursing Students: దయనీయంగా గాంధీ నర్సింగ్ విద్యార్ధుల పరిస్థితి.. స్పందించని ఉన్నతాధికారులు
వందకి పైగా సినిమాల్లో.. ఫిష్ వెంకట్
ఫిష్ వెంకట్, పూర్తి పేరు మంగలంపల్లి వెంకటేశ్. అతను చేస్తున్న వృత్తినే ఇంటి పేరుగా మార్చుకుని.. సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారం చేస్తూ ‘ఫిష్ వెంకట్’గా పేరు తెచ్చుకున్నాడు. దివంగత నటుడు శ్రీహరి ఆయనను తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పించగా, స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ చిత్రాలతో గుర్తింపు పొందారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, చిన్న చిన్న విలన్ పాత్రల్లోనూ ఇలా దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించాడు.
Also Read: Star Actress: ముందు వాటిని పెంచు.. అవకాశాలు వస్తాయి.. ఎన్టీఆర్ హీరోయిన్ కి ఘోర అవమానం?
తెలుగు హీరోలపై మండి పడుతున్న నెటిజన్స్
ఫిష్ వెంకట్ కుమార్తె రెండు రోజుల క్రితం సహాయం కోరినప్పటికీ, ఒక్కరూ కూడా చేయలేదు. ఎన్ని మూవీస్ చేస్తే ఏం లాభముంది. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఫ్యాన్స్ వాళ్ళ కొంచం ట్రీట్మెంట్ అందింది. అంత మందిలో ఒక్కడు ఆయన్ని పట్టించుకుని ఉంటే, బతికేవాడు. వీళ్ళు హీరోస్ కాదు.. రియల్ లైఫ్ జీరో అంటూ మండిపడుతున్నారు.