Andhra King Taluka Still
ఎంటర్‌టైన్మెంట్

Andhra King Taluka: రామ్ రాసిన రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. మహేష్ బాబు పి దర్శకత్వంలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ నుంచి ఫస్ట్ ట్రాక్ ‘నువ్వుంటే చాలే’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆల్రెడీ ఈ పాటకు సంబంధించి విడుదలైన ప్రోమోస్ పాట పై బజ్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ విడుదల చేసిన ఈ లిరికల్ వీడియోతో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలయ్యాయి.

Also Read- Senior Heroine: రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టేవారు.. క్యాస్టింగ్ కౌచ్‌పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ప్రేమకు హార్ట్ బీట్ ఉంటే అది ‘నువ్వుంటే చాలే’ పాట లాగానే వుంటుందనేలా ఈ పాటపై టాక్ నడుస్తుంది. ఈ మెస్మరైజ్ సాంగ్ ఫస్ట్ నోట్ నుంచే అలరించేలా ఉంది. మ్యూజికల్ మ్యాజిక్, ఆర్కెస్ట్రేషన్, అకౌస్టిక్స్ అన్నీ కూడా అద్భుతంగా వున్నాయి. అంతేకాదు, ఆల్-టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్స్ ప్లే లిస్ట్‌లో వెంటనే చోటు దక్కించుకోవడం విశేషం. రామ్ పోతినేని తొలిసారిగా లిరిక్ రైటర్‌గా మారి ఈ పాటను రాశారు. ఫస్ట్ టైమ్ రాసినా.. పాటలోని సాహిత్యం పోయెటిక్‌గా ఉంటూ వినగానే ఎక్కేస్తుంది. ప్రతి లైన్ మనసుని తాకేలా, ప్రేమకు నిజమైన నిర్వచనాన్ని కనుగొనడానికి హీరో చేసే ప్రయాణంలా అనిపిస్తుంది ఈ పాట.

ప్రేమని నిర్వచించలేమని, కేవలం అనుభవించగలమని తెలియజేసేలా ఈ పాట ఒక కథని తెలియజేస్తుంది. ఇది భావోద్వేగాలతో ప్రయాణించే అనుభూతిని ఇస్తుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ వోకల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. విజువల్‌గానూ ఈ పాట వావ్ అనేలా ఉంది. అద్భుతమైన రియల్ లోకేషన్స్ షూట్ చేసిన ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తోంది. రామ్ చర్మిషా, భాగ్యశ్రీ ఎలిగెన్స్ కలిసి వారి కెమిస్ట్రీ ప్రేమని అనుభూతి చెందేలా చేస్తోంది.  ఒక్కమాటలో చెప్పాలంటే, ‘నువ్వుంటే చాలే’ పాట అదిరిపోయింది. మనసుని కదిలించే ఈ పాట రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా అలరిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read- Kota And Babu Mohan: కోటన్న కోసం అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లును కూడా వదులుకున్నా.. బాబు మోహన్

ఈ పాట తర్వాత ఈ సినిమాను చూసే కోణం కూడా మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ఈ పాట ఉండటంతో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా రామ్ పోతినేని రాసిన ఈ పాటపై అంతా ప్రశంసలు వర్షం కురుస్తోంది. రామ్‌లో ఇంత టాలెంట్ ఉందా? ఇన్నాళ్లు ఎక్కడ దాచిపెట్టావ్? అంటూ ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?