Sumathi Satakam: నేటి సమాజంలో తెలుగుదనం ఉట్టిపడే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలాంటి లోటును పూడ్చేందుకు కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘సుమతీ శతకం’ ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాతలు, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ను ప్రత్యేకంగా రిలీజ్ చేశామని తెలిపారు. పోస్టర్‌లో హీరోయిన్ లుక్ చూస్తుంటే తెలుగుదనం ఉట్టిపడేలా, సాంప్రదాయ విలువలు ప్రతిఫలించేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి టీం సిద్ధమవుతోంది.
తాజాగా విడుదలైన హీరోయిన్ లుక్ చూస్తుంటే, ఆమె పాత్రలో మైమరిపించే తెలుగుతనం కనిపిస్తోంది. అంతేకాదు, పటేలు వాతావరణం, పరిసరాల దృశ్యాల్ని బట్టి ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైన గ్రామీణ బేడ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం వింటేజ్ విలేజ్ డ్రామా మరియు లవ్‌స్టోరీగా రూపొందుతోంది. ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు.
Read also- Star Actress: ముందు వాటిని పెంచు.. అవకాశాలు వస్తాయి.. ఎన్టీఆర్ హీరోయిన్ కి ఘోర అవమానం?
ఇందులో టేస్టీ తేజ, 30 ఇయర్స్ పృథ్వీ, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం సుభాష్ ఆనంద్, డైలాగ్స్ బండారు నాయుడు, ఎడిటింగ్ నాహిద్ మొహమ్మద్, సినిమాటోగ్రఫీ హాలేష్ అందించారు. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. తెలుగు మట్టివాసనను మోసుకొస్తున్న ఈ గ్రామీణ కథ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు