Kota And Babu Mohan: కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లు ఇద్దరూ వెండి తెర మీద కనిపిస్తే చాలు.. చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. తెలుగు సినిమా పరిశ్రమలో వీరిద్దరూ ఒక ఐకానిక్ జోడీ. వీరి కామెడీ కెమిస్ట్రీ తెలుగు ఆడియెన్స్ ను నవ్వించి, గుర్తుండిపోయే సన్నివేశాలను ఎన్నో అందించారు. అయితే, కోట శ్రీనువాసరావు అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఆయనను గుర్తు చేసుకుంటూ. బాబు మోహన్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
ఇద్దరు కలిసి 60కి పైగా సినిమాల్లో నటించారు..
కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లు ఇద్దరు కలిసి 60కి పైగా సినిమాల్లో నటించారు. ‘సీతారత్నం గారి అబ్బాయి”మామగారు’, ‘బొబ్బిలి రాజా’, ‘గణేష్’,వంటి సినిమాల్లో వీరి కామెడీ ట్రాక్‌లు ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ కి అయిన సినిమా హిట్ అవుతుందని ఒకప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఉండేది. కోట గారి విలక్షణమైన డైలాగ్ డెలివరీ, తెలంగాణ స్లాంగ్‌తో కూడిన హాస్యం, బాబు మోహన్ గారి అమాయకత్వంతో కూడిన కామెడీ టైమింగ్‌లు కలిసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
రీల్ లైఫ్‌లోనే కాదు, నిజ జీవితంలోనూ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్
రీల్ లైఫ్‌లోనే కాదు, నిజ జీవితంలోనూ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కోట శ్రీనివాసరావు బాబు మోహన్‌ని తన సొంత తమ్ముడిగా చూసేవాళ్ళు. అదే విధంగా బాబు మోహన్ కోట గారిని ‘అన్న’ అని ఆప్యాయంగా పిలిచేవారు. షూటింగ్ సమయంలో ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం, ఒకరికొకరు సరదాగా సెటైర్లు వేసుకోవడం, షూటింగ్ లొకేషన్‌లలో పక్కపక్క గదుల్లో ఉండడం వంటి సంఘటనలు వీరి స్నేహానికి అద్దం పట్టాయి.
నాకు కూడా కోటన్న లాంటి చావే రావాలి.. బాబు మోహన్
కోట శ్రీనివాసరావు మరణం తర్వాత బాబు మోహన్ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏడుస్తూ ఇలా మాట్లాడారు. కోటన్న పడుకుని టప్ అని ఎలా వెళ్లిపోయాడో .. నేను కూడా అలాగే వెళ్లిపోతా.. నేను అలాంటి రోజే వద్దే వద్దు. ఆయనకు ఎలాంటి చావు వచ్చిందో నాకు అలాగే రావాలి. కోటన్నని అడుగుతా.. దేవుడికి చెప్పు.. నాకు కూడా నీ లాగే రాయమని అని కంటతడి పెట్టుకున్నాడు.