Loans to Women (imagecredit:twitter)
తెలంగాణ

Loans to Women: మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.344 కోట్ల రుణాలు

Loans to Women: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఇందిరా మహిళా శక్తి సంబురాలు నేటితొ ఘనంగా ముగియనున్నాయి. బతుకమ్మను తలపించిన ఈ ఉత్సవాలు మహిళా సాధికారతకు వేదికగా నిలిచాయి. ఈ సంబురాల్లో భాగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.344 కోట్లు వడ్డీ లేని రుణాలను చెల్లించింది. ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్లు అందించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారి చే సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని(Indira Mahila Shakti Scheme) ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏటా కనీసం రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వమే రుణాలను సమకూర్చుతుంది. మహిళలు తీసుకున్న రుణాలకు సకాలంలో వడ్డీలు చెల్లిస్తుంది.

ప్రమాద, లోన్ బీమా పథకాలు..
దీంతో పాటు ప్రమాద బీమా, లోన్ బీమా వంటి స్కీంలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రమాదవశాత్తు మహిళా సభ్యురాలు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరైనా మహిళలు నష్టాలతో బ్యాంకు లోన్లు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, ఇతర మహిళలకు భారం కాకుండా ప్రభుత్వమే రూ.2 లక్షల వరకు లోన్ బీమా చెల్లిస్తుంది. ఇప్పటివరకు 410 మంది సభ్యులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల రూపాయలు చెల్లించగా, లోన్ బీమా కింద 5474 మంది సభ్యులకు రూ.2 లక్షల వరకు చెల్లింపులు చేసింది.

Also Read: Uppal Flyover: దసరా నాటికి ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభం.. మంత్రి కోమటిరెడ్డి

మహిళా సంఘాల్లో పెరిగిన సభ్యత్వం
ప్రమాద బీమా, లోన్ బీమాతో పాటు ప్రజా ప్రభుత్వం సకాలంలో వడ్డీలు చెల్లిస్తుండటంతో మహిళా సంఘాల్లో కొత్త సభ్యులు ఉత్సాహంగా చేరుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 1.67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరారు. దీంతో పాటు మహిళా సంఘాల్లో చేరే సభ్యుల అర్హత వయసును సడలించారు. గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల మహిళలకే అవకాశాలుండగా, ఇప్పుడు 15-65 ఏళ్ల మహిళలకు మహిళా సంఘాల్లో చేరే అవకాశం కల్పించారు. దీంతో పాటు దివ్యాంగ మహిళలకు(Disabled Women) ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఊపందుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 64 లక్షల సభ్యత్వాన్ని కోటి వరకు చేర్చే కార్యాచరణను అమలు చేస్తున్నారు.

ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క చురుకైన పాత్ర పోషిస్తూ మహిళా శక్తిని చాటుతున్నారు. రాష్ట్ర క్యాబినెట్ సభ్యులంతా తమ సొంత నియోజకవర్గాల్లో, తాము ఇన్‌చార్జ్‌గా ఉన్న జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తున్నారు.

Also Read: TG Ministers: మంత్రుల మధ్య కౌంటర్లు.. బడ్జెట్ రిలీజ్‌లు స్పీడ్‌ జరగట్లేదు

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు