Vivek Venkatswamy: మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిర మహిళ శక్తి సంబరాలలో కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(Mynampally Rohit Rao), ఎమ్మెల్సీ అంజిరెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) పాల్గొన్నారు. ముందుగా ఇందిరా మహిళా శక్తి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇచ్చిన ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉచిత మహిళ బస్సు, గ్యాస్. సబ్సిడీ. తదితర సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. మహిళలకు మహిళ క్యాంటీన్లో ఎలక్ట్రిక్ బస్సులు పెట్రోల్ పంపులు ఇస్తున్నామన్నారు.
మన రాష్ట్రం నుంచి టాక్స్
మహిళలు పట్టుదలతో పని చేస్తారు అనుకున్నది సాధిస్తారు బ్యాంకులు అందుకే ముందుకు రావడం జరిగిందని వివరించారు. వడ్డీ లేని రుణాలు మహిళలకే వెళ్లినప్పుడు కుటుంబం బాగుపడుతుంది. తదనంతరం రాష్ట్రం బాగుపడుతుంది. దేశం బాగుపడుతుందని చెప్పారు. 6 గ్యారంటీలు సరిగా అమలు చేస్తున్నారా లేదా అనేది రివ్యూ చేయాలని ముఖ్యమంత్రి(CM) ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు మేలు చేయాలనే గరీబి హటావో స్కీం తీసుకొచ్చిందన్నారు. కేంద్రం నుంచి మాట్లాడి తెలంగాణ(Telamgana)కు నిధులు తీసుకురావాలని మెదక్ ఎంపీ కోరారు. మన రాష్ట్రం నుంచి టాక్స్ కేంద్రాన్ని కడుతున్నాం ముఖ్యమంత్రి మాట ప్రకారం ఇందిర మా ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు.
10 సంవత్సరాలు గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లా వ్యాప్తంగా 9 వేల ఇవ్వడం జరిగింది. 60 వేల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని బిఅర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లకు తీసుకెళ్లిందనీ ఖజానా మొత్తం ఖాళీ చేసిందని వివరించారు. కార్మిక, ఉపాధి, గనుల శాఖమంత్రి వివేక్ వెంకటస్వామి ఖజానా ఖాళీ అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే అప్పులే ఉన్నాయన్నారు. ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
Also Read: PM Dhan Dhanya Krishi Yojana: పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం.. ప్రతి ఏటా రూ.24వేల కోట్లు
రేషన్ కార్డులో మార్పులు చేర్పులు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహిళలు కోటీశ్వరులు కావాలని బ్యాంకు లింకేజ్ కల్పించడం జరిగిందన్నారు మహిళా సంక్షేమానికి గత సంవత్సర కాలంలో, జిల్లా వ్యాప్తంగా 100 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేని రుణాలు మెదక్ నియోజకవర్గంలో4కోట్లు పై బడి రిలీజ్ చేయడం జరుగుతుందని, ప్రమాద బీమా నలుగురికి ఇవ్వబోతున్నాం అని చెప్పారు. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డులు 4390 మందికి ఇవ్వబోతున్నాం అని వివరించారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా 9964. మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోయితున్నాం అని అన్నారు. అలాగే రెండు లక్షల 16 వేల మంది రేషన్ బియ్యం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, పాల్గోన్నారు.
ఈ కార్యక్రమానంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన వివరాలు ఆయా శాఖల అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ , డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, అడిషనల్ పిడి సరస్వతి, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, హవేలీఘన్పూర్ తాసిల్దార్ సింధూ రేణుక, మస్వయం సహాయక సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో వన మహోత్సవంలో భాగంగా మంత్రి, ఎమ్మెల్యే, మొక్కలు నాటారు. మెదక్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు పోస్ట్ ఆఫీస్ వద్ద శంకుస్థాపన చేశారు.
నర్సాపూర్‌లో
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కల్యాణలక్ష్మి, శాది ముబారక్, చెక్కులు, కొత్త రేషన్ కార్డులు మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీ సీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Air India Crash: ఎయిరిండియా క్రాష్‌పై వెలుగులోకి పెనుసంచలనం!