TG Ministers (imagecredit:twitter)
తెలంగాణ

TG Ministers: మంత్రుల మధ్య కౌంటర్లు.. బడ్జెట్ రిలీజ్‌లు స్పీడ్‌ జరగట్లేదు

TG Ministers: ఈ నెల 10న జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు సీఎం, డీప్యూటీ సీఎంకు షాకిచ్చినట్లు తెలిసింది. బడ్జెట్ రిలీజ్‌లు స్పీడ్‌గా జరగడం లేదని కొందరు మంత్రులు కేబినెట్‌లో చర్చకు తీసుకువచ్చారు. ప్రధానంగా ఇరిగేషన్, పంచాయితీ రాజ్ వంటి కీలక శాఖల నిధులు కూడా విడుదల చేయకపోవడం విచిత్రంగా ఉన్నదంటూ మంత్రులు సున్నితంగానే ప్రశ్నించారు. కొన్ని శాఖలనే నిధులు విడుదల చేస్తున్నారంటూ ఓ మంత్రి, పర్మిషన్లు, సీఎం నుంచి ఆదేశాలు వచ్చినా కూడా పైసలు రిలీజ్ చేయడం లేదని మరి కొందరు కేబినెట్‌లో ప్రస్తావించినట్లు తెలిసింది.

దీనిపై అధికారులు కూడా సమాధానం చెప్పలేక డిప్యూటీ సీఎం వైపు చూసినట్లు తెలిసింది. ప్రభుత్వం సాంక్షన్ ఇచ్చిన నిధులు కూడా ఇవ్వకపోతే, వర్క్స్ ఎలా ముందుకు సాగుతాయంటూ కొందరు మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఫండ్స్ లేకపోవడంతో ప్రాజెక్టులు పెండింగ్ పడుతున్నట్లు వివరించారు. గడిచిన 18 కేబినెట్ మీటింగ్ లలో(జూలై 10 మినహా) జరిగిన నిర్ణయాలు, ఆమోదాల్లోని కొన్ని అంశాలకు ఇప్పటికీ నిధులు ఇవ్వలేదని పలువురు మంత్రులు ముక్కుసాటిగానే అడిగేశారట. దీంతో సీఎం, డిప్యూటీ సీఎంలు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలిసింది.

ఊదాహరణకు..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని భూ సేకరణ కోసం ప్రభుత్వం ఆర్టర్ రిలీజ్ చేసింది. అయితే మూడు జిల్లాల భూ సేకరణ డబ్బులు ఒక అకౌంట్ కే పడటం వలన ఖర్చు చేయడం వీలు కాలేదట. ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabakar) ఆర్ధిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ మూడు జిల్లాలకు వేర్వేరు ఆర్డర్లతో నిధులు కేటాయించి క్లోజ్ చేయాలని సీఎం(CM) ఆదేశించారు. మిగతా వర్క్స్ సంబంధించిన ఫండ్స్ కోరగా, ‘‘ముందు ఇవి ఖర్చు చేయాలని, ఆ తర్వాత వచ్చేది రానిది తర్వాత చూద్దాం”అంటూ మరో మంత్రి చమత్కారంగా చెప్పారట.

Also Read: Medak District: కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు అనీల్ దారుణ హత్య

మంత్రులు పంచ్ లతో డిప్యూటీ సీఎం అనాసక్తిగా కుర్చున్నట్లు తెలిసింది. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, దేవాదయ శాఖ మంత్రులు కూడా నిధులుస్పీడ్ గా కేటాయించి, వర్క్స్ వేగంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు వివరించినట్లు సమాచారం.

కేబినెట్ తర్వాత లైట్…?
మరోవైపు కేబినెట్ లో ఒకే చెప్తున్న ఆర్ధిక మంత్రి, ఉన్నతాధికారులు..ఆ తర్వాత రెస్పాండ్ కావడం లేదని కొందరు మంత్రులు ఆఫ్​ది రికార్డు(Off The Record)లో చెప్పారు. ప్రజలు, ఉద్యోగులకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులను గ్రీన్ ఛానల్ లో పెట్టి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నా.. ఆ దిశగా ముందుకు సాగడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత రిక్వెస్టులుపక్కకు పెట్టినా సరే కానీ.. ప్రజలకు సంబంధించిన అంశాలు డీలే చేయడం సరికాదని సీనియర్ మంత్రులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.

గతంలోనే ఇదే అంశంపై సీఎం కు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వివరించారు. రెగ్యులర్ గా విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఆచరణలో ఆశించిన రిజల్ట్ కనిపించడం లేదని మంత్రులే అసహనాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. త్వరలోనే ఈసమస్యకు చెక్ పెడతానని స్వయంగా సీఎం మంత్రులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Also Read: Blood Pressure: వీటితో హైబీపీ.. ముందుగా గుర్తించకపోతే డేంజర్లో పడ్డట్టే?

 

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?