Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ వేరే అమ్మాయితో ఆ పని..?
Ariyana Glory ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ

Ariyana Glory: తెలుగు టెలివిజన్ యాక్టర్ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్‌గా, బిగ్ బాస్ తెలుగు 4 ఫైనలిస్ట్‌గా నిలిచింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)తో చేసిన ఇంటర్వ్యూతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేని స్థాయికి చేరుకుంది. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంలోని లవ్ స్టోరీ, బ్రేకప్, ఆ తర్వాత జరిగిన సంఘటనలను బయటపెట్టి అందరినీ షాక్ కు గురి చేసింది.

అరియానా గ్లోరీ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బావతో ప్రేమలో పడ్డానని తెలిపింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె బావకి ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత, అతనికి హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో, అరియానా కూడా డిగ్రీ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఇద్దరూ ఒకే ఇంట్లో మూడేళ్లపాటు కలిసి జీవించారు. కానీ, ఒక రోజు అతన్ని అనుకోని పరిస్థితిలో చూసిన అరియానా, ఆ బంధానికి బ్రేకప్ చెప్పి విడిపోయింది.

బావకి గుడ్ బై చెప్పిన అరియానా

కొంతకాలం తర్వాత, ఇద్దరూ మళ్లీ కలిసి రెండేళ్లపాటు కలిసి ఉన్నారు. అయితే, అరియానా రేడియో జాకీ (ఆర్జే)గా పనిచేస్తున్న సమయంలో, ఒక సహోద్యోగితో ఆమె సన్నిహితంగా ఉండటం తన బావకు నచ్చలేదు. దీంతో అతను ఆమెను తిట్టి, అవమానించడమే కాకుండా, మానసికంగా హింసించాడు. ఈ పరిస్థితుల్లో అరియానా ఆ బంధానికి పూర్తిగా గుడ్ బై చెప్పి, తన బావతో శాశ్వతంగా విడిపోయింది. తొమ్మిదో తరగతిలో మొదలైన ఈ ప్రేమ కథ, దురదృష్టవశాత్తూ సుఖాంతం కాలేదని ఆమె ఏడుస్తూ చెప్పుకొచ్చింది.

ఆర్జీవీ ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసింది..

అరియానా గ్లోరీ రామ్ గోపాల్ వర్మతో 2020లో చేసిన ఒక ఇంటర్వ్యూ ఆమె జీవితంలో ఒక గేమ్-ఛేంజర్‌గా నిలిచింది. ఈ ఇంటర్వ్యూ ఆమెకు బిగ్ బాస్ తెలుగు 4లో అవకాశం తెచ్చిపెట్టింది, దీనితో ఆమె రాత్రికి రాత్రి స్టార్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీతో ఆమె చర్చించిన బోల్డ్ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య