Kota Srinivas Rao Death: కోట శ్రీనివాస రావు తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 750కి పైగా చిత్రాల్లో నటించాడు. తన నటనా ప్రతిభతో వందలాది చిత్రాల్లో మెరిసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన నటనకు గుర్తింపు తెచ్చిన కొన్ని హిట్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
కోట కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన సినిమాలు ఇవే..
1. ప్రతిఘటన (1985)
పాత్ర: శివనాథ్ (విలన్)
ఈ చిత్రం కోట శ్రీనివాస రావును తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ విలన్‌గా నిలబెట్టింది. ఆయన చేసిన శివనాథ్ పాత్ర ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రంలో సామాజిక అంశాలను గుండెల్ని పిండే విధంగా చూపించారు.
2. అహ నా పెళ్ళంట (1987)
పాత్ర: పిసినిగొట్టు నారాయణ
ఈ కామెడీ సినిమాలో కోట శ్రీనివాస రావు హాస్య నటుడిగా తన సత్తా చాటారు. ఆయన చెప్పిన “కోడి కథ” సన్నివేశం తెలుగు సినిమా హాస్య సన్నివేశాల్లో ఒక ఐకాన్‌గా మిగిలిపోయింది. ఆయన చేసిన హాస్య పాత్రల అన్నింటికంటే పిసినిగొట్టు నారాయణ పాత్ర చాలా స్పెషల్. ఈ పాత్రలో ఆయన ఎంత గొప్పగా నటించగలరో చూపించింది.
3. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
పాత్ర: వెంకటేష్ తండ్రి
ఈ కుటుంబ కథా చిత్రంలో కోట శ్రీనివాస రావు ఒక తండ్రి పాత్రలో నటించి, కామెడీ, ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
4. గబ్బర్ సింగ్ (2012)
పాత్ర: శ్రుతి హాసన్ తండ్రి
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కోట శ్రీనివాస రావు కీలక పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర సినిమాకు హాస్యం, బలాన్ని జోడించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా?
గతంలో కోట ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” తెలుగు దర్శకులు అడిగినా అవకాశాలు ఇవ్వడం లేదని ఓపెన్ గానే చెప్పాడు. ఒక్క పాత్ర అయిన ఇస్తే బావుండు .. నా జీవితం సినిమానే కదా.. చివరి రోజుల్లో మంచి పాత్ర ఇస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది ” అంటూ ఎమోషల్ అయ్యాడు. దీని వలన ఆయన డిప్రెషన్ లోకి వెళ్లాడని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆయన ఇంటికి పరిమితమయ్యారని అంటున్నారు.