Bhatti Vikramarka (imagcredit:twitter)
తెలంగాణ

Bhatti Vikramarka: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకురాబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పినట్లుగానే రోహిత్ వేముల చట్టాన్ని త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక పకడ్బందీ చట్టాన్ని తీసుకువచ్చేందుకు తెలంగాణ న్యాయశాఖ పనిచేస్తుందని వివరించారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని కోరుతూ కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చిందని, ఆ కేసును రీ ఓపెన్ చేసి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల(Rohith Vemula) చావుకు కారణమైన వ్యక్తుల పై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన భారతీయ జనతా పార్టీ(BJP) దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోనీ ఏఐసిసి(AICC) కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ లో ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam)తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ లో యూనివర్సిటీ అధికారులకు విన్నవించిన విషయాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.

Also Read: Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం!

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్ తో పాటు విషం, తాడును ఇస్తే ఉరివేసుకునేందుకు పనిచేస్తుందని ఆవేదనతో వివరించాడన్నారు. యూనివర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా వీసీకి వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే రోహిత్ వేముల తో పాటు మరో నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వీసీపై బీజేపీ సర్కార్ ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఇది అత్యంత దారుణమన్నారు.

Also Read: Vijayawada: వీధి కుక్కలపై అమానుషం.. వాడు అసలు మనిషేనా!

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు