Kaleshwaram Water Flow: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రాణహిత నది ప్రవాహం పెరగడంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద ప్రవాహం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం(Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద గోదావరి నదితో కలిసి 11.720 మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ వరద ప్రవాహం 8,68,580 లక్షల క్యూసెక్కుల ఇన్ప్లే వస్తోంది.
దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి 8,68,580 లక్షల క్యూసెక్కుల నీటిని ఔట్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బరాజ్ జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో జీవించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
Also Read: Vijayawada: వీధి కుక్కలపై అమానుషం.. వాడు అసలు మనిషేనా!
టేకులగూడెం వంతెన మూసివేత
గోదావరి నది వరద ఉప్పొంగిన నేపథ్యంలో తెలంగాణ(Telangana), ఛత్తీస్ ఘడ్(chettis gard) రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163 పై గల టేకులగూడెం వంతెన మూసివేసినట్టు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ములుగు(Mulugu) జిల్లాలోని గోదావరి నది పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ హెచ్చరించారు. ఈ విషయమై ఎస్పీ మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో ములుగు జిల్లా ఎగువ భాగం నుండి గోదావరి నదికి వరద ఉధృతి పెరిగినందున తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163 పై పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం శివారులో గల రేగుమాగు వాగు పొంగి టేకులగూడెం వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తున్నందున, వరద ఉధృతి తగ్గేవరకు ఇట్టి వంతనపై ప్రయాణాలను నిషేధిస్తున్నామని, వంతెన ముఖ ద్వారం వద్ద బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కావునా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోవాలని సూచించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రయాణం చేయాలని సూచించారు.
Also Read: Raja Singh: ఆయన కారణంగానే రాజీనామా చేశా.. రాజాసింగ్