Vidya Balan: బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి బయటకు వెల్లడించింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సంతోషించే లోపు ఆ ప్రాజెక్ట్ ఊహించని విధంగా మధ్యలోనే ఆగిపోయింది. ఒక్క రాత్రిలోనే ఆమెను 9 దక్షిణాది సినిమాల నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది.
Also Read: Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?
“నన్ను ‘ఐరన్ లెగ్’ అని ముద్ర చేశారు. ఆ క్షణంలో ఎంత బాధ అనిపించిందో వర్ణించలేను,” అని ఆమె భావోద్వేగంతో చెప్పారు.“ఆ సినిమా ఆగిపోవడానికి నేను కారణం కాదు, కానీ బాధ్యత మాత్రం నా మీద పడింది. ఆ తర్వాత నుంచి దక్షిణాదిలో అవకాశాలు రాలేదు. అయినప్పటికీ, బాలీవుడ్‌లో ‘పా’, ‘డర్టీ పిక్చర్’, ‘ఇష్కియా’ వంటి చిత్రాలతో నా టాలెంట్ ను నిరూపించుకున్నాను,” అని విద్యా గర్వంగా చెప్పింది.
తెలుగు ఆడియెన్స్ కు విద్యా బాలన్ ‘ఎన్.టి.ఆర్ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రలో మరపురాని నటనతో సుపరిచితమైనవారు. ఆమె నటనకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.ప్రస్తుతం వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉన్న విద్యా బాలన్ ఈ గత అనుభవం గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యా బాలన్ జీవితం నేర్పిన పాఠం ఒకటే – అడ్డంకులను అధిగమించి, పట్టుదలతో పోరాడితే విజయం తప్పక సొంతమవుతుంది.
Also Read: Robbery in ATM: స్పెషల్ డ్రైవ్ చేసిన చోటే ఏటీఎం చోరీ.. దొంగలు ఎలా తప్పించుకున్నారంటే!