Nayanthara: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ సినిమా పరిశ్రమ అయినా తేడా లేకుండా సినిమా సెలబ్రిటీలపై పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని కొందరు సీరియస్‌గా తీసుకుంటే మరికొందరు సిల్లీగా తీసుకుంటారు. ఇక సినీ కపుల్ విడాకుల రూమర్లు అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి చిన్న విషయానికి వారు విడిపోతున్నారంటూ వార్తలు వైరలవుతుంటాయి. తాజాగా ఈ రూమర్ల జాబితాలోకి నయనతార చేరిపోయారు. ఇటీవల కోలీవుడ్ పరిశ్రమలో నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌తో విడిపోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ముందు ఇలాంటి వార్తలను ఏమీ పట్టించుకోని నయనతార తర్వాత.. గట్టి రిప్లై ఇచ్చారు. ఇలాంటి వార్తలు రాసే వారికి స్ర్టాంగ్ రిప్లై ఇచ్చే విధంగా తన ట్విటర్‌లో పోస్ట్ ఒకటి పెట్టారు. ఈ పోస్టుతో ఫేక్ వార్తలు రాసేవారికి బ్రేక్ పడింది.
Alsio Read- Ponnam Prabhakar: అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.. మంత్రి పొన్నం ప్రభాకర్
అసలు ఏం జరిగింది అంటే.. నయనతార(Nayanthara) ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌తో విడిపోతున్నారంటూ కోలీవుడ్‌లో పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. దీనిపై నయనతార స్పందిస్తూ పోస్ట్ ఒకటి పెట్టారు. నయనతార భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)తో కలిసి దిగిన ఫొటో షేర్ చేశారు. వారిపై వచ్చిన సిల్లీ న్యూస్ చూసినపుడు రియాక్షన్ ఇలాగే ఉంటుందని రాసుకొచ్చారు. తమపై ఎవరైనా అసత్య ప్రచారాలు చేయాలనుకుంటే ఈ ఫోటో చూసిన తర్వాత తమ అభిప్రాయం చెప్పాలని అన్నారు. ఇది చూసిన నెటిజన్లు నయనతార రియాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా ఆయా వైబ్‌సైట్లు అసత్య ప్రచారాన్ని మానుకోవాలంటూ ఈ ఫోటో ద్వారా తెలిపారు.
Alsio Read- Baahubali The Epic: ‘బాహుబలి’ రీరిలీజ్ గురించి… రాజమౌళి ఏమన్నారంటే?
గతంలో వైవాహిక బంధం గురించి నయనతార సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఈ వదంతులకు దారితీసింది. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు..’ అంటూ అందులో రాసుకొచ్చారు. ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె దాన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఆ వార్త వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ పోస్టును స్క్రీన్‌షాట్స్ తీసుకుని వైరల్ చేశారు. దీంతో, నయనతార, విఘ్నేశ్‌తో విడిపోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మెగా 157’, యశ్ ‘టాక్సిక్’ తదితర చిత్రాల్లో నయనతార నటిస్తున్నారు. దర్శకుడు విఘ్నేశ్ అయితే ప్రదీప్ రంగనాథన్ హీరోగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏదేమైనా నయనతార విడాకుల వార్తలకు బ్రేక్ పడటంతో అమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.