Tridha Choudhury: ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతోంది. సగం సగం దుస్తులతో ఫోటోషూట్లు చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలకు ప్రతిస్పందనగా, కొందరు నటీమణులు నెటిజన్లపైనే తిరిగి విరుచుకుపడుతున్నారు. “ముందు డ్రెస్సింగ్ సెన్స్ సరిచేసుకోవాలి, లేకపోతే ఈ నెగటివిటీ తప్పదు” అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా, ఈ వివాదంలో మరో నటి చిక్కుకుంది. ఆమె ఎవరో కాదు, త్రిధా చౌదరి.
తెలుగు సినిమాలతో పాటు ‘ఆశ్రమ్’ వంటి హిందీ వెబ్ సిరీస్‌లలో తన నటనతో గుర్తింపు పొందిన త్రిధా, ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో సంచలనం సృష్టించింది. ఒక ఫోటోలో ఆమె లైట్ గ్రీన్ క్రాప్ టాప్, ఫ్లోరల్ ప్రింట్ బాటమ్‌తో కనిపించగా, నెటిజన్లు దీన్ని “బీచ్‌కి వేసుకునే బికినీని ఇంట్లో వేసుకున్నావా?” అంటూ అలాంటి కామెంట్లు పెడుతున్నారు.మరో ఫోటోలో బ్లాక్ డ్రెస్‌లో కుర్చీపై కూర్చున్న త్రిధా, ఆ యాంగిల్లో ప్యాంట్ లేనట్టే కనిపించడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు. “ప్యాంట్ లేకుండా ఫోటోషూట్‌కి ఫోజులిచ్చావా, త్రిధా?” అని కొందరు, “ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఏమనాలి!” ఆయన అయిన చెప్పాలి కదా అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో విమర్శల సునామీ తప్పడం లేదు.
త్రిధా చౌదరి మాత్రమే కాదు, ఇలాంటి ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో నెగటివిటీని ఎదుర్కొంటున్న హీరోయిన్ల జాబితా పెరుగుతోంది. డ్రెస్సింగ్ సెన్స్‌పై జరుగుతున్న ఈ చర్చలు ఎంతవరకు కొనసాగుతాయో, ఈ వివాదాలు నటీమణుల ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి!