War 2: సౌత్, నార్త్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘వార్ 2’. YRF బ్లాక్‌బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటులంతా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ మెసేజ్‌లు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మెసేజ్‌లలో నుంచి ఓ లైన్, ఇప్పుడీ సినిమాపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ‘కబీర్’గా చేస్తున్న హృతిక్ రోషన్ పాత్ర ఇకపై ఈ ప్రాంఛైజీలో వచ్చే సినిమాలలో ఉండకపోవచ్చనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఇకపై ఈ ‘వార్’ ప్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR)దే అనే టాక్‌కు ఆ మెసేజ్ ఊతమిస్తోంది.
Also Read- Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
జూలై 8న హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఓ ఎమోషనల్ మెసేజ్‌ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ మెసేజ్‌తో పాటు షూట్ పూర్తయినట్టుగా తెలిపే ఓ ఫొటోని కూడా పంచుకున్నారు. అందులో కేక్ కట్ చేస్తూ కనిపించారు. కేక్‌పై ‘ఇట్స్ ఎ వ్రాప్’ అని కాకుండా ‘ఇజ్ ఇట్ ఎ వ్రాప్?’ అని రాసి ఉండటం గమనించవచ్చు. ఇది ఈ ప్రాంచైజీకి చివరి సినిమా కాదనే విషయాన్ని తెలియజేస్తుంది. అందులోనూ ‘వార్ 3’కి సంబంధించి ఇంతకు ముందే వార్తలు కూడా వచ్చాయి. అయితే అంతం కాదని ప్రాంఛైజీకి సంబంధించి చెబుతున్నప్పటికీ, ‘కబీర్’ పాత్రపై మాత్రం అనుమానాలకు తెరలేపింది. ‘ఏజెంట్ కబీర్’ పాత్ర ఈ ‘వార్ 2’తో ముగించేస్తున్నారా? అనేలా బాలీవుడ్ సర్కిల్స్‌లో సైతం మాట్లాడుకునేలా చేస్తుంది. అందుకు కారణం ఏంటంటే..
Also Read- Oh Bhama Ayyo Rama: సుహాస్‌ని విజయ్ సేతుపతితో పోల్చిన రాక్ స్టార్.. విషయమేంటంటే?
హృతిక్ రోషన్ పోస్ట్‌లో ‘కబీర్‌కు వ్రాప్ చెప్పడం ఎప్పుడూ తీపి, చేదు అనుభూతిని కలిగిస్తుంది. మళ్లీ నేను మాములు మనిషిగా అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది’ అని రాసుకొచ్చారు. ఈ మాటే ఇప్పుడు అన్నీ అనుమానాలకు కారణమవుతోంది. ‘వార్ 2’లో కబీర్ పాత్రని ముగించేస్తున్నారా? అందుకే హృతిక్ అలా పోస్ట్ చేశాడా? ‘కబీర్’ పాత్రలోకి ఇకపై ఎన్టీఆర్ వస్తాడా? అనేలా అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. హృతిక్ పోస్ట్ చూస్తుంటే.. ఎన్టీఆరే ఇకపై ఈ ‘వార్’ సినిమాలను ముందుకు తీసుకెళ్లనున్నాడనేది అర్థమవుతోంది. బాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఎన్టీఆర్ ‘వార్ 2’కు మించి YRF స్పై యూనివర్స్‌లో పెద్ద పాత్రను పోషించబోతున్నాడనేలా వార్తలు కూడా మొదలయ్యాయి. కేవలం ‘వార్ 2’కి మాత్రమే కాకుండా ఈ స్పై యూనివర్స్‌లో రాబోయే ఇతర సినిమాలలోనూ ఎన్టీఆర్ భాగమవుతారనేలా టాక్ వినబడుతుండటంతో.. ఆయన అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు.
Feeling a mixed bag of emotions as the cameras stopped rolling for #War2. 149 days of relentless chase, action, dance, blood, sweat, injuries… and it was all WORTH IT!@tarak9999 sir it has been an honor to work alongside you and create something so special together.… pic.twitter.com/MWCm4QMPyd
— Hrithik Roshan (@iHrithik) July 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు